అనుమానాస్పద మృతి... దర్యాప్తు చేస్తున్న పోలీసులు

అనుమానాస్పద మృతి... దర్యాప్తు చేస్తున్న పోలీసులు

నాంపల్లి: మండల పరిధిలోని మాందాపురం గ్రామానికి చెందిన కటికం సత్తయ్య, వయసు (65)అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం గ్రామంలో కలకలం రేపింది. స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఘటనపై ఆత్మహత్యా.. లేక హత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు ఆధారాలను సేకరించి, మృతికి గల కారణాలను ఆరా తీస్తున్నారు.పోస్టుమార్టం నివేదిక, దర్యాప్తులో వెలువడే వివరాల ఆధారంగా మృతికి అసలు కారణం తేలనుంది. ఘటనపై మృతుడి కుమారుడు కటికం వెంకటయ్య గౌడ్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ ఇంట్లో ఎవరు లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తమ ఇంట్లోకి చొరబడి తన తండ్రిని పథకం ప్రకారం హత్య చేసి ఏమి తెలియనట్టు గ్రామపంచాయతీ కార్యాలయంలో ఓడివేసినట్లుగా దృశ్యాన్ని చిత్రీకరించారని ఆయన అన్నారు. తన తండ్రి మృతి పై పలు అనుమానాలు ఉన్నాయని సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు పోలీసులను కోరారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Views: 29

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News