ప్రతి ఇంటా మొక్క.. మెట్‌పల్లి పచ్చదనమే లక్ష్యం

19, 21వ వార్డుల్లో ఘనంగా వనమహోత్సవ మొక్కల పంపిణీ

ప్రతి ఇంటా మొక్క.. మెట్‌పల్లి పచ్చదనమే లక్ష్యం



మెట్‌పల్లి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా మెట్‌పల్లి పట్టణంలోని 19వ, 21వ వార్డుల్లో మంగళవారం మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెట్‌పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి వార్డు ప్రజలకు మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ.. పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టడంతో పాటు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన పచ్చని వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యతను కూడా ప్రజలు తీసుకోవాలని కోరారు. పట్టణాన్ని పచ్చదనంతో, ఆహ్లాదకర వాతావరణంతో తీర్చిదిద్దడమే మున్సిపాలిటీ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గౌడ్, స్థానిక వార్డు కౌన్సిలర్లు బోడ్ల ఆనంద్, ఖాజా అజీమ్, ఇతర ప్రజాప్రతినిధులు, ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ విష్ణు వర్ధన్ రెడ్డి, వార్డు అధికారులు, మున్సిపల్ సిబ్బంది, పట్టణ ప్రముఖులు, వార్డు ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Views: 38

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News