కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం...
- - కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాడుతాం
- - మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు
ఓదెల : పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని అవి తీర్చే వరకు ప్రజల్లోకి వెళ్లి ప్రజలతో ఇచ్చిన హామీలు తీర్చే వరకు పోరాడుతూ నిరసనలు చేపడతామన్నారు.అధికారంలోకి వచ్చి 1000 రోజులు గడుస్తున్న 6 గ్యారెంటీలు,420 దొంగ హామీలిచ్చి ఓట్లు వేసుకొని రాజ్యమేలుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. "తెలంగాణ రాష్ట్రంలో 4.5 కోట్ల ప్రజల ఆకాంక్షను దెబ్బతీసే విధంగా రాజ్యమేలుతున్నారన్నారు.మీరు ఇచ్చిన 6 హామీలు, 420 గ్యారెంటీల ను వెంటనే అమలు చేయాలని పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి పిలుపు మేరకు విలేకరుల సమావేశం నిర్వహించామన్నారు. మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్న పిలుపు మేరకు 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు 420 హామీలు,6 గ్యారెంటీ మోసాలపై నియోజకవర్గ,జిల్లా కేంద్రాల్లో ధర్నాలు,నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమాల వివరాలు: 2వ తేదీన 6 గ్యారెంటీ వైఫల్యాలను ఎండగడుతూ నియోజకవర్గాల కేంద్రాలలో ధర్నా,బాకీ కార్డుల ప్రదర్శన,420 అడుగుల ఫ్లెక్సీ ప్రదర్శన ఉంటుందన్నారు. 3వ తేదీన వ్యవసాయ విద్వంసంపై నీటిపారుదల సమస్యలు,యూరియా కొరత, రైతు భీమా రద్దుకు నిరసనగా రైతు సదస్సులు. కెసిఆర్ రైతుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రైతు బీమా ను విస్మరించే పరిస్థితిలు ఏర్పడుతున్నాయని అందుకు వ్యతిరేకంగా రైతు బీమాను తీసివేయకుండా రైతుల పక్షాన పోరాడుతామన్నారు. రైతుల కోసం కేసీఆర్ ఏర్పాటు చేసిన రైతు బంధు పథకం పెంచి ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడంపై రైతులను మోసం చేస్తున్నారని,అంతేకాక బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కెసిఆర్ 24 గంటలు కరెంటు ఇస్తే ప్రస్తుత ప్రభుత్వం దాని విస్మరించిందన్నారు.గుంట భూములేని రైతు కూలీలకు సంవత్సరానికి 12000 ఇస్తానని మాట తప్పారని ఇలాంటి ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి ఇచ్చిన హామీలను నెరవేర్చుకుందామని రైతులకు,ప్రజలకు పిలుపునిచ్చారు.నిరసన కొరకు ఓదెల మండలం నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. 4వ తేదీన వృద్ధులు,వితంతులు,ఒంటరి మహిళ, బీడీ కార్మికులకు ఫించన్ ను 2 వేల నుండి 4 వేల వరకు పెంచి ఇస్తానని, అదేవిధంగా వికలాంగులకు 4 వేల నుండి 6 వేలకు పెంచి ఇస్తానని చెప్పి దొంగ మాటలు చెప్పి హామీలను నెరవేర్చకపోవడం ప్రజలను మోసం చేయడమే అన్నారు. కార్మికులకు పెన్షన్ల ను పెంపు బాకీల పై నిరసన కార్యక్రమాలు ఉంటాయన్నారు. "మహిళలకు నెలకు ₹2,500 చొప్పున 33 నెలలకు బాకీ ఉన్న ₹82,500 చెల్లించాలని,అలాగే వృద్ధులు,బీడీ కార్మికులకు 4,000 రూపాయల పెన్షన్ చొప్పున 33 నెలలకు 66,000 రూపాయలు బాకీ ఉన్నందున అందరూ ఈ నిరసనలో పాల్గొనాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని నమ్మబలికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన ఉద్యోగాలను ఉద్యోగులకు నియామక పత్రాలను ఇచ్చి మేము ఉద్యోగాలు ఇచ్చాం అనడం శోషనీయమన్నారు.అంతేకాక నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి మరిచారన్నారు.ఆటో కార్మికులకు ఇవ్వవలసిన బాకీ ని చెల్లించాలని డిమాండ్ చేశారు.మాజీ సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లి చెప్పే అవకాశం దొరికిందని, ఈ అవకాశాన్ని మన సద్వినియోగం చేసుకొని ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాడుదాం అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మ్యాడగొని శ్రీకాంత్ గౌడ్,ఓదెల గ్రామ శాఖ అధ్యక్షుడు రమేష్, నాయకులు గుండేటి మధు యాదవ్,రౌతు జలపతి,రాసాల అశోక్,బోడకుంట నరేష్, తీర్థాల కుమారస్వామి,మద్దెల శ్రీను తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


