సొంత నిధులతో బోరు వేయించిన చేగుంట ఉపసర్పంచ్ మహమ్మద్ రఫీక్ బాయ్

చేగుంట ఉపసర్పంచ్ మానవత్వం

సొంత నిధులతో బోరు వేయించిన చేగుంట ఉపసర్పంచ్ మహమ్మద్ రఫీక్ బాయ్

 మెదక్  : పదవి అంటే ప్రజలకు సేవ చేయడమేనని చేగుంట ఉపసర్పంచ్ మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు మహమ్మద్ రఫీక్ నిరూపించాడు. చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలోని ముదిరాజ్ సంఘం మరియు కాలనీవాసులు తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని, ఎవరి కోసం ఎదురుచూడకుండా తన సొంత నిధులతో బోరుబావి వేయించారు. ఈ సందర్భంగా రఫిక్ బాయ్ మాట్లాడుతూ ఇంకా వేరే ఏమైనా సమస్యలు ఉన్నా నా దృష్టికి వస్తే తన వంతుగా సాయం చేస్తానని అన్నారు.ప్రభుత్వ నిధుల కోసం చూడకుండా సొంత జేబు నుండి డబ్బులు పెట్టి బోరు వేయించి నీటి కష్టాలు తీర్చిన ఉపసర్పంచ్ ను ముదిరాజ్ సంఘం నాయకులు కాలనీవాసులు ఘనంగా అభినందించారు. ఇలాంటి నాయకులు ఉండడం గర్వకారణమని కొనియాడారు.తాగునీటి సమస్య తీరడంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముదిరాజ్ సంఘం కాలనీవాసులు ఉపసర్పంచ్ రఫిక్ బాయ్ ని సన్మానించారు. ఉపసర్పంచ్ చేసిన ఈ సేవా కార్యక్రమంపై గ్రామంలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చౌదరి శ్రీను మాజీ సర్పంచ్ నాగభూషణం విఎస్ఎస్ మాజీ చైర్మన్ సత్తయ్య చంద్రం గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Views: 12

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News