అసెంబ్లీలో సమస్యను లేవనెత్తాలని ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్‌ను కోరిన ఎంఐఎం
మంచిర్యాల: మంచిర్యాల ప్రజలు ఎన్నోసంవత్సరాలుగా నివసిస్తున్న ఇళ్లు, అన్ని ప్రభుత్వ అనుమతులు ఉన్న స్థలాలను 22-A నిషేధిత జాబితాలో చేర్చడం పై ప్రభుత్వం వెంటనే పునఃపరిశీలన చేయాలని ఎంఐఎం మంచిర్యాల పట్టణ కార్యదర్శి సయ్యద్ ఇబ్ని అఫాన్ డిమాండ్ చేశారు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ మరియు మంచిర్యాల ప్రాంతాల్లో కలిపి సుమారు 10,332 ఇళ్లు 22-A నిషేధిత జాబితాలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయాన్ని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, మంచిర్యాల ప్రజల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రశ్నించాలని సయ్యద్ ఇబ్ని అఫాన్ విజ్ఞప్తి చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


