పీ ఆర్ టీ యూ ధర్నాకు తరలిన వెళ్లిన నాయకులు

పీ ఆర్ టీ యూ ధర్నాకు తరలిన వెళ్లిన నాయకులు

జాతీయ రహదారి నిర్మాణ పనుల వద్ద ఉంచిన జనరేటర్ దొంగతనం

సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించిన జైనథ పోలీసులు

దొంగతనానికి గురైన 25 KVA జనరేటర్, మహేంద్ర మాక్స్ పికప్ వాహనం, సెల్‌ఫోన్లు స్వాధీనం

వివరాలు వెల్లడించిన ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి

ఆదిలాబాద్ జిల్లా:( విజన్ ఆంధ్ర బ్యూరో)జాతీయ రహదారి నిర్మాణ పనుల వద్ద ఉంచిన 25 KVA జనరేటర్‌ను దొంగతనం చేసిన కేసును జైనథ్ సర్కిల్ పోలీసులు సాంకేతిక ఆధారాలతో ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
పోలీసుల వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన నిందితులు సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనానికి పాల్పడాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో బేలా-కొబ్బయి రహదారిపై దహేగాం ఎక్స్‌రోడ్ సమీపంలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వద్ద ఉంచిన జనరేటర్‌ను గమనించారు.
జూలై 31, న రాత్రి సమయంలో ముగ్గురు నిందితులు మహేంద్ర మాక్స్ పికప్ వాహనంలో అక్కడికి చేరుకుని, వాచ్‌మెన్లు నిద్రిస్తున్న సమయంలో జనరేటర్‌ను అక్కడి నుంచి తరలించి తమ గ్రామానికి తీసుకెళ్లారు. అనంతరం జనరేటర్‌కు సంబంధించిన టైర్లు, పైభాగంలోని కవరింగ్‌ను తొలగించి వేరే ప్రాంతంలో పడేశారు.
దొంగతనం చేసిన జనరేటర్‌ను తక్కువ ధరకు విక్రయించేందుకు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బిలోలి తాలూకా కొండలవాడి గ్రామానికి చెందిన దేవ్కతే పవన్‌ను సంప్రదించారు. జనరేటర్‌ను రూ.90,000లకు విక్రయించేందుకు ఒప్పందం చేసుకుని, అడ్వాన్స్‌గా రూ.2,000 తీసుకున్నారు.
మిగిలిన మొత్తాన్ని జనరేటర్‌ను కొండలవాడి గ్రామానికి తరలించిన అనంతరం చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో నిందితులు జనరేటర్‌ను మహేంద్ర మాక్స్ పికప్ వాహనంలో తరలిస్తుండగా పోలీసులు అనుమానంతో వాహనాన్ని తనిఖీ చేశారు.
విచారణలో నిందితులు జనరేటర్ దొంగతనం చేసిన విషయాన్ని వెల్లడించడంతో పోలీసులు వారి వద్ద నుంచి దొంగతనానికి గురైన 25 KVA జనరేటర్, మహేంద్ర మాక్స్ పికప్ గూడ్స్ వాహనం నంబర్ MH34BZ8140, రూ.2,000 నగదు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

సాంకేతిక ఆధారాలు, పోలీసుల సమన్వయంతో కేసును త్వరితగతిన ఛేదించిన జైనథ్ సర్కిల్ పోలీసులను డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి అభినందించారు. నేరాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరని, నేరస్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

 నిందితుల వివరాలు: 

* A1) విశాల్ రాథోడ్ S/o చంద్రకాంత్, వయస్సు 26 సంవత్సరాలు, కులం: ST-లంబాడ, వృత్తి: ప్రైవేట్ ఉద్యోగం, నివాసం: లాల్డోహ్ గ్రామం, జివితి తాలూకా, చంద్రపూర్ జిల్లా, మహారాష్ట్ర — అరెస్ట్.

* A2) రాథోడ్ రాహుల్ — విశాల్ రాథోడ్ సోదరుడు, మహారాష్ట్ర — అరెస్ట్.

* A3) రాథోడ్ పరమేశ్వర్ — లాల్డోహ్ గ్రామం, జివితి తాలూకా, చంద్రపూర్ జిల్లా, మహారాష్ట్ర — పరారీలో ఉన్నాడు.

* A4) దేవ్కతే పవన్ S/o రాజేశ్వర్, వయస్సు 26 సంవత్సరాలు, కులం: ధన్గర్, వృత్తి: డీజే ఆపరేటర్, నివాసం: కొండలవాడి గ్రామం, బిలోలి తాలూకా, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర — అరెస్ట్.

ఈ కేసులో నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జైనథ్ సీఐ జి. శ్రావణ్, బేలా ఎస్సై మధుకృష్ణ, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Views: 65

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News