బీసీ శ్మశానవాటికా? లేక డంపింగ్ యార్డా

బీసీ శ్మశానవాటికా? లేక డంపింగ్ యార్డా

  • ఐదు రోజుల్లో కార్యాచరణ ప్రకటించాలి
  • రూ.2 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేయాలి.
  • లేకపోతే బీసీ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఆందోళన కార్యక్రమాలు చేపడతాం.
  • బీసీ శ్మశానవాటికల దుస్థితిపై కందుకూరి రాజ్‌కుమార్ ఆగ్రహం.

తాండూరు (వికారాబాద్ జిల్లా) తాండూరు నియోజకవర్గ బీసీ సంఘం కన్వీనర్ కందుకూరి రాజ్‌కుమార్ నేతృత్వంలో తాండూరులోని పాత తాండూరు మరియు తాండూరు బీసీ శ్మశానవాటికలను సందర్శించి పరిశీలించారు. ముఖ్యంగా తాండూరు పోలీస్‌స్టేషన్ వెనుక ఉన్న బీసీ శ్మశానవాటిక అత్యంత దారుణమైన పరిస్థితిలో ఉందని కందుకూరి రాజ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. చుట్టుపక్కల ఉన్న షాపులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారు పెద్దఎత్తున చెత్తాచెదారాన్ని శ్మశానవాటికలోనే వేయడంతో ఆ ప్రాంతం క్రమంగా డంపింగ్ యార్డుగా మారిపోయిందని అన్నారు. అదేవిధంగా ఆ మార్గంలో వచ్చిపోయే వారు బహిరంగంగా మూత్ర విసర్జన చేయడం, మాలమూత్ర విసర్జన చేయడం వల్ల పరిసర ప్రాంతమంతా తీవ్ర దుర్వాసనతో, అపరిశుభ్రంగా మారిందని తెలిపారు. విపరీతంగా పెరిగిన ముళ్లచెట్లు, కంపచెట్లు, పొదలతో శ్మశానవాటికలోకి వెళ్లేందుకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. “ఇది శ్మశానవాటికా? లేక డంపింగ్ యార్డా?” అని కందుకూరి రాజ్‌కుమార్ ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను సూటిగా ప్రశ్నించారు.తాండూరులోని బీసీ శ్మశానవాటికల అభివృద్ధి కోసం గతంలో అనేకసార్లు పాలకులు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, జిల్లా అధికారులకు వినతిపత్రాలు అందజేసి విజ్ఞప్తులు చేసినా ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం చూపకపోవడం బాధాకరమన్నారు. ఇకనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్వయంగా శ్మశానవాటికలను సందర్శించి అక్కడి వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని కోరారు. ఐదు రోజుల్లోగా స్పష్టమైన కార్యాచరణ ప్రకటించి, తాండూరులోని బీసీ శ్మశానవాటికల అభివృద్ధికి రూ.2 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని బీసీ సంఘం తరఫున సూటిగా డిమాండ్ చేస్తున్నామని కందుకూరి రాజ్‌కుమార్ తెలిపారు. శ్మశానవాటికలను కేవలం తాత్కాలికంగా శుభ్రం చేయడం కాకుండా ప్రహరీ, గేటు, పారిశుధ్యం, విద్యుత్, లైటింగ్, నీటి సౌకర్యం, షెడ్లు, డ్రైనేజీ తదితర మౌలిక వసతులతో పూర్తిస్థాయిలో ఆధునికంగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. “ఐదు రోజుల్లోగా కార్యాచరణ ప్రకటించకపోతే బీసీ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన కార్యక్రమాలు చేపడతాం” అని కందుకూరి రాజ్‌కుమార్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సందర్శించిన వారిలో బీసీ సంఘం జిల్లా నాయకులు గడ్డం వెంకటేశ్,నాయి బ్రాహ్మణ సమాజం అధ్యక్షులు పరమేశ్, బీసీ సంఘం ప్రతినిధులు మంతటి రాజు, నరహరి గోపాల్, నవీన్, శివ,రమేష్, పరమేశ్, రవి, సీనూ, కిరణ్ & వినయ్ తదితరులు ఉన్నారు.

Views: 34

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News