ఉద్యోగుల సంక్షేమమే ముఖ్యం
మందమర్రి,(మంచిర్యాల) : సింగరేణి సంస్థలోని ఉద్యోగుల సంక్షేమమే ముఖ్యమని మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్.రాధాకృష్ణ అన్నారు. సోమవారం స్థానిక జిఎం కార్యాలయంలో ఏఐటియూసి 21 వ నిర్మాణాత్మక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కార్మిక సంఘాలు తెలిపిన సమస్యలపై సత్వరమే పరిష్కారం చూపుతామని తెలిపారు. ఏరియా గనుల్లో సేఫ్టీ మెటీరియల్, డ్రిల్ రాడ్,బిట్లు, రూఫ్ బోల్టుల కృత తీర్చకపోవడం కారణం చేత బొగ్గు ఉత్పత్తి, కార్మికుల భద్రత తీవ్రంగా దెబ్బతింటుందన్నారు. విభాగాల్లో ఖాళీగా ఉన్న అటెండెండ్ పోస్టుల ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. ఈ సమావేశంలో బ్రాంచ్ సెక్రటరీలు సత్యనారాయణ, మల్లేష్,అక్బర్ అలీ,ఎస్ఓటుజిఎం లలిత్ ప్రసాద్, ఈ అండ్ ఏం బాలాజీ భగవతి ఝా, కేకే గ్రూప్ ఏజెంట్ ఖాదీర్, ఎస్.కె గ్రూప్ ఏజెంట్ సంతోష్ కుమార్, ప్రాజెక్ట్ ఆఫీసర్ రాంబాబు,డీజీఎం పర్సనల్ అశోక్,ఐఈడి కిరణ్,సివిల్ షేక్ మదీనా భాష ఇతర అధికారులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


