ఆశా కార్యకర్తల సమావేశంలో ఆరోగ్య పరిస్థితులపై సమీక్ష
మిడ్జిల్, మిడ్జిల్: మిడ్జిల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా కార్యకర్తలకు ప్రతినెల మొదటి మంగళవారం నిర్వహించే నెలవారీ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శివకాంత్ ఆకస్మికంగా హాజరై ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామాల్లో జరుగుతున్న డెలివరీలు, షుగర్, బీపీ, టీబీ కేసులు, టీబీ పరీక్షలు తదితర అంశాలపై ఆశా కార్యకర్తలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే సీజనల్ వ్యాధులైన డెంగీ, మలేరియా, చికెన్‌గున్యా కేసుల పరిస్థితిపై ఆరా తీశారు.వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. అనుమానిత కేసులను గుర్తించి వెంటనే పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని తెలిపారు.వైద్య సిబ్బంది ప్రతి ఒక్కరూ శ్రద్ధగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శివకాంత్ సూచించారు.ఈ సమావేశంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ మీర్జా, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఆయుబ్ ఖాన్, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


