డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చొరవతో మధిర మున్సిపాలిటీకి రూ. 62 కోట్లు
- మారనున్న మధిర పట్టణ స్వరూపం!
- వార్డుల్లో ప్రజా అవసరాల గుర్తింపు
- 15వ వార్డులో మరియు 16 వ వార్డులో పర్యటన
- రోడ్లు,డ్రైనేజీల నిర్మాణానికి సమగ్ర నివేదికలు
- సత్వరమే పనులు ప్రారంభించేలా కసరత్తు!
మధిర : మధిర మున్సిపాలిటీ అభివృద్ధికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కప్రత్యేక చొరవ తీసుకున్నారు.తన సొంత నియోజకవర్గమైన మధిరను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో, పట్టణంలో మౌలిక వసతుల కల్పన కోసం రూ. 62 కోట్ల భారీ నిధుల ప్రతిపాదనలకు ఆయన శ్రీకారం చుట్టారు.ఈ మేరకు పురపాలక శాఖ కమిషనర్ కార్యాలయం నుండి వేగంగా ప్రక్రియ ప్రారంభమైంది. మధిర మున్సిపాలిటీ వార్డుల్లో మెటల్ రోడ్ల నిర్మాణం కోసం రూ. 17 కోట్లు, మధిర మున్సిపాలిటీ వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణం కోసం రూ. 46 కోట్లు, అలాగే సీసీ డ్రైన్లు, ఆర్‌సీసీ కల్వర్టులు మరియు రూ. 62 కోట్ల పనులపై వెంటనే ,మధిర మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు.డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారి చొరవతో నిధుల ప్రక్రియ ఊపందుకోవడంతో, మధిర మున్సిపాలిటీ అభివృద్ధి కమిటీ సభ్యులు మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో16 వార్డు విస్తృతంగా పర్యటించారు. వార్డులో తక్షణమే నిర్మించాల్సిన సీసీ రోడ్లు, డ్రైనేజీల స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పనులను గుర్తించారు. మధిర పట్టణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి రూ. 62 కోట్ల భారీ నిధుల ప్రతిపాదనలకు చొరవ చూపిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారికి కృతజ్ఞతలు తెలిపారు.ప్రతి వార్డులో పేరుకుపోయిన మురుగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ, వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా డ్రైనేజీ వ్యవస్థను పునర్నిర్మించి, పట్టణ రూపురేఖలు మారేలా నాణ్యమైన రోడ్లను అందుబాటులోకి తెస్తామని చెప్పారు.అధికారుల నివేదికల ప్రక్రియ పూర్తి కాగానే పనులను సత్వరమే ప్రారంభించి మధిరను ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ సామినేని సుజాత మున్సిపల్ కమిషనర్ శామ్యూల్ పాల్ బెంటెక్, వైస్ చైర్మన్ కోన ధని కుమార్, డెవలప్‌మెంట్ కమిటీ సభ్యులు వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి డాక్టర్ వాసిరెడ్డి రామనాథం, రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పారుపల్లి విజయకుమార్,కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తలుపుల వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నాయకుడు మిరియాల వెంకటరమణ గుప్తా, రంగా శ్రీనివాసరావు తన్ని రామకృష్ణ కౌన్సిలర్ వంకాయలపాటి వెంకట నాగేశ్వరరావు నకరికంటి రాజేశ్వరి కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు మాగం ప్రసాద్ మైలవరం చక్రి నాయకులు సామినేని రామనాథం, బోయపాటి వెంకటేశ్వరరావు నగరిగంటి గోవిందు జగన్నాథచారి వినోదు సందీప్త సబ్ ఇంజనీర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


