శునకాల , కోతులు బారి నుండి  వాకర్స్ సభ్యులను రక్షించండి 

శునకాల , కోతులు బారి నుండి  వాకర్స్ సభ్యులను రక్షించండి 

మంచిర్యాల టౌన్ :మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాముని చెరువు కట్ట పైకి ఉదయం మరియు సాయంత్రం వేళల్లో వందలాది మంది మహిళలు , యువకులు , విద్యార్థిని విద్యార్థులు , వ్యాపారస్తులు , ప్రభుత్వ ఉద్యోగులు, సింగరేణి , ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు, వాకింగ్ , జాగింగ్ మరియు ఓపెన్ జిమ్ చేయడానికి వందలాది మంది వస్తున్నారు . కానీ రాముని చెరువు కట్ట పైన కోతులు మరియు కుక్కలు గుంపులు గుంపులుగా వచ్చి వాకింగ్ చేసే వాకర్స్ సభ్యులను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయని సింగరేణి విశ్రాంతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు  గజేల్లి వెంకటయ్య ఆరోపించారు   గతంలో కోతులు , కుక్కలు వాకర్స్ సభ్యుల పై దాడి చేసి గాయపరిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని, ఈ కోతుల , కుక్కల భయానికి రాముని చెరువు కట్ట పైకి వాకింగ్ చేయడానికి రావడానికి చాలా మంది భయాందోళనకు గురి అవుతున్నారని ఈ కోతుల , కుక్కల భయానికి చేతు లో కర్రలు పట్టుకొని వాకింగ్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడిందని  కావున రాముని చెరువు కట్ట పైన గుంపులు గుంపులుగా సంచరిస్తున్న కోతులను , కుక్కలను రాముని చెరువు కట్ట పైకి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కార్పొరేషన్ అధికారులను కోరారు

Views: 21

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News