పాత పెన్షన్ కోసం నల్ల బ్యాడ్జీలతో నిరసన - ములుగు

పాత పెన్షన్ కోసం నల్ల బ్యాడ్జీలతో నిరసన - ములుగు

ములుగు : కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలని కోరుతూ ములుగు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. టీజీఈ జేఏసీ, తపస్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఈ నిరసన జరిగింది.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు నెలల్లో ఓపీఎస్ అమలు చేస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. సీపీఎస్ వల్ల భవిష్యత్ భద్రత లేదని, వెంటనే రద్దు చేయాలన్నారు. హామీ అమలు కాకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో టీపీయూఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోనె రవీందర్ తో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

Views: 37

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News