మానవత్వం చాటుకున్న రాంరెడ్డిపల్లి సర్పంచ్..
- బాధిత కుటుంబానికి తక్షణ సాయం
- ప్రజల కష్టాల్లో అండగా ఉంటా
- రాంరెడ్డి పల్లి సర్పంచ్ లపంగి నరసింహ
నల్గొండ/మర్రిగూడ: రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పగిల్లా కొండయ్య అకస్మాత్తుగా మృతి చెందడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమైంది. కొండయ్య మరణవార్త తెలుసుకున్న వెంటనే రాంరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ లపంగి నరసింహ బాధిత కుటుంబాన్ని ప్రత్యక్షంగా పరామర్శించారు. వారిని పరామర్శించి, అధైర్యపడవద్దని ధైర్యం చెప్పారు. అంత్యక్రియల నిమిత్తం అత్యవసర ఆర్థిక సాయంగా తన సొంత నిధుల నుంచి రూ.5,000 అందజేసి తన దాతృత్వాన్ని, మానవత్వాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ లపంగి నరసింహ మాట్లాడుతూ గ్రామంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఆపద సమయాల్లో అండగా నిలవడమే నా ప్రథమ కర్తవ్యం. ప్రజలకు సేవ చేయడానికి ప్రజాప్రతినిధిగా ఎల్లప్పుడూ ముందుంటాను. గ్రామ ప్రజల సుఖదుఃఖాల్లో భాగస్వామినవుతూ ప్రతి కుటుంబానికి అండగా ఉంటాను అని స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం ద్వారా రావాల్సిన పథకాలు, ఇతర సదుపాయాలు అందేలా చూస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.సర్పంచ్ చేసిన ఈ తక్షణ సహాయాన్ని,కష్టకాలంలో నిలబడిన సర్పంచ్‌కు గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు కారింగ నరసింహ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నక్క శీను, వార్డు సభ్యులు భీమనగోని యాదయ్య, పగిల్లా వంశీ, సిరిపంగి శ్రీను, నిలయ్య, బేత జంగయ్య, పగిల్లా వెంకులు గ్రామ యువకులు,తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


