మిడ్జిల్‌లో వినాయక ఉత్సవ కమిటీ ఎన్నిక

మిడ్జిల్‌లో వినాయక ఉత్సవ కమిటీ ఎన్నిక

మిడ్జిల్: మిడ్జిల్ గ్రామ పంచాయతీ పరిధిలో వినాయక ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు శుక్రవారం వినాయక ఉత్సవ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ సర్పంచ్ ఎడ్ల శంకర్ గౌరవ అధ్యక్షులుగా వ్యవహరించనుండగా, ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా కోట్ల పర్వతాలు ఎన్నికయ్యారు.ఉపాధ్యక్షులుగా పంజం కృష్ణ, బరిగెల కుర్మయ్య, ప్రధాన కార్యదర్శిగా ఏదుల శివ, కోశాధికారిగా మద్ది లక్ష్మారెడ్డి, సాంస్కృతిక కార్యదర్శులుగా పసుల శివ, మహమ్మద్ జహంగీర్ ఎంపికయ్యారు.ముఖ్య సలహాదారులుగా అల్వాల్ రెడ్డి, మహమ్మద్ గౌస్, బాల్ రెడ్డి , వెంకటయ్య , సంపత్ కుమార్, నరేందర్ రెడ్డి, ఉస్మాన్‌లను నియమించారు.కార్యవర్గ సభ్యులుగా పంజం చంద్రమౌళి, బరిగెల ఆదాము, మిడిదొడ్డి నర్సింహా, రామ్ గౌడ్, బరిగేల రమేష్, బరిగేల వెంకటయ్య, మావిళ్ల మన్యం, సౌట హరిగౌడ్, రాములు యాదవ్, లాలు ముదిరాజ్, కోట్ల ఆంజనేయులు, ఎర్రోళ్ల మల్లేష్, గోద కృష్ణ, అరడి మల్లేష్, రహీం, రాయిళ్ల అంజి, బీర్ల శంకర్, నరేష్‌లను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ గ్రామంలో వినాయక ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఐక్యతతో నిర్వహించేందుకు అందరి సహకారం తీసుకుంటామని తెలిపారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

Views: 19

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కార్మికుని కుటుంబానికి ప్రిన్స్ యజమాన్యం భరోసా కార్మికుని కుటుంబానికి ప్రిన్స్ యజమాన్యం భరోసా
సదాశివపేట:  ప్రిన్స్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికునికి యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. కంపెనీ మేనేజ్మెంట్ హెచ్ఆర్ హెడ్ రాజశేఖర్, ప్లాంట్ హెడ్ శశిమోల్ మోహన్ ముందుకు వచ్చి 11...
డీజేలకు అనుమతి లేదు
ఫోటో మరియు వీడియో గ్రాఫర్ నియోజక వర్గ అధ్యక్షుడికి సన్మానం 
ముస్లిం సంతుష్టీకరణ కోసమే రేవంత్ ప్రభుత్వం
టిబి పోషణ కిట్ల పంపిణీ
తాత మధు, కేటీఆర్ దిష్టిబొమ్మల దహనం
గర్భిణీలకు రాజన్న ఫౌండేషన్ అండ