సబితా ఇంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కంద పెద్ద నర్సింహ
కందుకూరు :మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని టీ ఎంఆర్పిఎస్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కంద పెద్ద నర్సింహ మర్యాదపూర్వకంగా కలిసి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా దసరా పండుగ ప్రజల జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని, ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలగాలని కంద పెద్ద నర్సింహ ఆకాంక్షించారు.పండుగలు సమాజంలో ఐక్యత, సోదరభావం, పరస్పర గౌరవాన్ని పెంపొందించేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గుమ్మడివెల్లి మాజీ సర్పంచ్ మస్కు బాబు, కొలన్ గూడ మాజీ సర్పంచ్ గణేష్, రావిచెట్టి శ్రీనివాస్, వంక రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


