సాలూరలో దుర్గామాత లడ్డూ, ఆభరణాల వేలం

రూ.1.77 లక్షలకు అమ్మవారి మణిహారం.. రూ.1.46 లక్షలకు లడ్డూ

సాలూరలో దుర్గామాత లడ్డూ, ఆభరణాల వేలం

నిజామాబాద్ జిల్లా సాలూర మండల కేంద్రంలోని శ్రీ సార్వజనిక్ దుర్గామాత ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి లడ్డూ, మెడలోని పైసల దండ, చీరలు, వివిధ రూపాల్లోని అమ్మవారి అలంకరణ వస్తువులకు వేలంపాట నిర్వహించారు. భక్తులు ఉత్సాహంగా పాల్గొని వేలంలో పోటీపడి వస్తువులను దక్కించుకున్నారు. అమ్మవారి మణిహారం అత్యధికంగా రూ.1,77,000కు బిల్లా అభినయ్ (భవాని టీం) దక్కించుకోగా, దుర్గామాత లడ్డూను కన్నె సాయిలు (వసంత్) రూ.1,46,000కు దక్కించుకున్నారు.

వేలంలో దక్కించుకున్న వారి వివరాలు:

దుర్గాదేవి లడ్డూ: కన్నె సాయిలు (వసంత్) – రూ.1,46,000
దుర్గాదేవి మణిహారం: బిల్లా అభినయ్ (భవాని టీం) – రూ.1,77,000త్రిపుర దేవి: కల్లూరి భాస్కర్ – రూ.12,000
శాకంబరి దేవి: సున్నపు సాయిలు – రూ.6,000
అన్నపూర్ణ దేవి: సోక్కం సాయిలు – రూ.25,000
కాత్యాయిని దేవి: బిల్లా గంగాధర్ – రూ.27,000
మహాలక్ష్మి దేవి: ఉష్కే సిద్ధు – రూ.39,000.లలితా త్రిపుర సుందరి దేవి: అల్లె పొశెట్టి – రూ.25,555 సరస్వతి దేవి: మేదరి సాయిలు (సంతొష్) – రూ.25,000
దుర్గాదేవి: గాండ్ల రాజన్నా  – రూ.35,555
మహిషాసుర మర్దిని: బాజే భాస్కర్ – రూ.33,333
దుర్గామల్లేశ్వరి కల్యాణం: కన్నె సాయి వినోద్ (చింటూ) – రూ.40,000.వేలంపాటలో భక్తులు ఉత్సాహంగా పాల్గొని అమ్మవారిపై తమకున్న భక్తిని చాటుకున్నారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ పరిసరాల్లో భక్తి వాతావరణం నెలకొంది.

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News