వరంగల్ రైల్వే స్టేషన్‌లో విషాదం

IMG-20251210-WA0017

వరంగల్​:  వరంగల్ రైల్వే స్టేషన్‌లో విషాదం నెలకొంది. బుధవారం ఉదయం కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఎక్కబోతుండగా ప్రమాదవశాత్తూ జారిపడి ఓ వ్యక్తి మృతిచెందాడు. రైలు చక్రాల కింద పడటంతో శరీరం నడుము దగ్గర రెండు ముక్కలైంది.వరంగల్ జీఅర్పీ హెడ్ కానిస్టేబుల్ ఎస్ రవీందర్ రెడ్డి కథనం ప్రకారం.. బుధవారం ఉదయం వరంగల్ నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఎక్కేందుకు 50 ఏళ్ల వ్యక్తి వచ్చాడు. అతను ట్రైన్ ఎక్కుతుండగా పట్టుతప్పి రైలు పట్టాలపై పడిపోయాడు. అదే సమయంలో రైలు ప్లాట్‌ఫామ్‌పై నుంచి ముందుకు వెళ్లింది. అలా ఆ వ్యక్తి మీద నుంచి రైలు చక్రాలు వెళ్లడంతో శరీరం రెండు ముక్కలై అక్కడికక్కడే మృతిచెందాడు.
 ​మృతుడు తెల్లటి, లేత నీలి రంగు, దానిపై బ్రౌన్ కలర్ లైన్స్ గల ఫుల్ షర్ట్, లేత ఆకుపచ్చ (పెసర) రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. మృతుడి వద్ద ఖమ్మం నుంచి వరంగల్‌కు మంగళవారం ప్రయాణించిన రైల్వే టికెట్ తప్ప ఎలాంటి ఆధారాలు, గుర్తింపు కార్డులు లభించలేదు. రైల్వే అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని ఎంజీఎం దవాఖాన మార్చురీలో భద్రపరిచినట్టు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసినవారు వరంగల్ రైల్వే జీఆర్పీ ఠాణాలో గాని లేదా రైల్వే పోలీసుల మొబైల్ నెంబర్లు. 9849749220, 8712658627 సంప్రదించాలని హెడ్ కానిస్టేబుల్ రవీందర్ రెడ్డి పేర్కొన్నారు.

Views: 11

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

దర్యాపూర్‌లో ఘనంగా వనమహోత్సవం దర్యాపూర్‌లో ఘనంగా వనమహోత్సవం
ముత్తారం, : ముత్తారం మండలంలోని దర్యాపూర్ గ్రామంలో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా బుధవారం మాస్ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.గ్రామంలో పచ్చదనం పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు...
మురుగు నీటితో దోమల బెడద.. పట్టించుకోని అధికారులు
రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం.
మైదం అవిలయ్య మృతికి తాటికొండ సీతయ్య సంతాపం
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి
ఖమ్మం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి రెండు దశాబ్దాలుగా విశ్వసనీయ గళం.
హైదరాబాద్‌ లో 12 మంది నకిలీ డాక్టర్ల అరెస్ట్