పండుగ సాయన్న జీవితం సమానత్వం, ధైర్యసాహసాలకు ప్రతీక

జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయంలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు

పండుగ సాయన్న జీవితం సమానత్వం, ధైర్యసాహసాలకు ప్రతీక

ప్రజల కోసం పోరాడిన మహనీయుల చరిత్రను భావితరాలకు తెలియజేయాలి – అదనపు ఎస్పీ పి. మౌనిక 

ఆదిలాబాద్ జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయంలో ప్రజావీరుడు పండుగ సాయన్న జయంతిని పురస్కరించుకొని అదనపు ఎస్పీ (అడ్మిన్) పి. మౌనిక  ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
తెలంగాణ చరిత్రలో పండుగ సాయన్నకు ప్రత్యేక స్థానం ఉందని, పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన ప్రజావీరుడిగా ఆయన ప్రజల మనసుల్లో నిలిచిపోయారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అన్యాయాన్ని ఎదిరించడం, ఆత్మగౌరవంతో జీవించడం, అణగారిన వర్గాలకు అండగా నిలవడం వంటి ఆయన జీవితంలోని విలువలు నేటి సమాజానికి ఎంతో అవసరమని తెలిపారు.
సమాజంలో అసమానతలు తొలగి ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు, గౌరవం లభించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రజల కోసం నిస్వార్థంగా నిలబడిన మహనీయుల జీవితాలు యువతకు మార్గదర్శకంగా నిలుస్తాయని, వారి ఆశయాలను తెలుసుకొని సామాజిక బాధ్యతతో ముందుకు సాగాలని సూచించారు.
పోలీసు శాఖ ప్రజల రక్షణతో పాటు సామాజిక బాధ్యత, మానవీయ విలువలకు ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. సమాజంలో శాంతి, సామరస్యం, పరస్పర గౌరవం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ కమతం ఇంద్రవర్ధన్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ డి వెంకటి, సీఐ నైలు, పోలీసు కార్యాలయం అధికారులు సూపరిండెంట్ సులోచన, పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News