టిఆర్ఎస్ జిల్లా యూత్ అధ్యక్షుడిగా వినోద్ గౌడ్
కాటారం (భూపాలపల్లి): తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్) జయశంకర్ భూపాలపల్లి జిల్లా యూత్ అధ్యక్షుడిగా బుర్ర వినోద్ గౌడ్ ను నియమించారు. ఈ మేరకు టిఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ జాగృతి లో చురుకైన కార్యకర్తగా పనిచేస్తూ, కల్వకుంట్ల కవితకు సుపరిచితులుగా ఉన్న వినోద్ గౌడ్ నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బుర్ర వినోద్ గౌడ్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన పార్టీ జిల్లా నాయకత్వానికి, రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ యూత్ విభాగాన్ని పూర్తిస్థాయిలో విస్తరింప చేస్తామని, రానున్న ఎన్నికల్లో తమ సత్తాను నిరూపిస్తామనివెల్లడించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


