జిన్నారం మండలంలో గ్యాస్ లీక్ కలకలం!
సారకా ల్యాబొరేటరీస్‌లో ప్రమాదం.. ఇద్దరు కార్మికులు మృతి
సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలోని సారకా ల్యాబొరేటరీస్ పరిశ్రమలో గ్యాస్ లీక్ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందినట్లు సమాచారం. పరిశ్రమలోని గ్లాస్ బ్లాక్ వద్ద గ్యాస్ లీక్ కావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనతో పరిశ్రమ పరిసర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. నైట్ షిఫ్ట్‌లో 11, 12 గంటల మధ్యలో విధులు నిర్వహిస్తున్న కార్మికులు సుదర్శన్ (28), బాలాజీ (29) మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో కార్మికుల భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలని, కార్మికులకు తగిన రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఇలాంటి సంఘటన జరుగుతున్నాయని కార్మికుల స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


