జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ కు నాగర్ కర్నూల్ నుంచి ఐదుగురు ఎంపిక

అక్టోబర్ 23 నుంచి చెన్నైలో పోటీలు.. తెలంగాణ జట్టు మేనేజర్ గా డా. స్వాములు

జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ కు నాగర్ కర్నూల్ నుంచి ఐదుగురు ఎంపిక

నాగర్ కర్నూల్ :41వ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ కు నాగర్ కర్నూల్ జిల్లా నుంచి ఐదుగురు అథ్లెట్లు ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. అక్టోబర్ 23 నుంచి 27 వరకు చెన్నైలో జరిగే ఈ జాతీయ స్థాయి పోటీలకు తెలంగాణ రాష్ట్ర జట్టు తరఫున వీరు ప్రాతినిధ్యం వహించనున్నారు.అండర్-18 బాలుర 1000 మీటర్ల పరుగుకు దొడ్డి సంతోష్ కుమార్, అండర్-20 బాలుర 4x100 మీటర్ల రిలేకు అథపు గణేష్, అండర్-16 బాలుర లాంగ్ జంప్ కు అంకురి దిల్షాన్, అండర్-20 బాలికల స్టీపుల్ చేజ్ కు స్వప్న కొడావత్, అండర్-16 బాలికల హైజంప్ కు శ్రీవల్లి ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్ర జట్టు మేనేజర్ గా డా. సోలపోగుల స్వాములు ఎంపికయ్యారు. ఎంపికైన క్రీడాకారులు పతకాలు సాధించి తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డా. ఎం. విజేందర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి డా. సోలపోగుల స్వాములు ఆకాంక్షించారు.

Views: 18

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

నల్గొండ జిల్లాలో దారుణం భార్యను హతమార్చిన భర్త! నల్గొండ జిల్లాలో దారుణం భార్యను హతమార్చిన భర్త!
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మర్రిగూడ పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది  నల్గొండ/మర్రిగూడ:అయ్యో దేవుడా.. ఏడాది కిందట పెద్ద కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆ...
తాడిచెర్ల నుంచి శబరిమలకు భక్తి యాత్ర
హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలను కరీంనగర్ జిల్లాలో కలపాలి
రిజర్వేషన్ ఆమెకు.. రాజ్యం ఆయనకు!
టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమం
పేకాట స్థావరానికి స్థలం కల్పించిన మిట్టల్ జిన్నింగ్ మిల్లు యజమానిపై కేసు నమోదు
రైతుల పంట రుణాలు, వివిధ అప్పులు మాఫీ చేయాలి!!