మహిళా రక్షణ చట్టాలపై అవగాహన పెంచుకోవాలి - జెండర్ స్పెషలిస్ట్ సునీత

తహసీల్దార్ కార్యాలయంలో POSH చట్టంపై అవగాహన సదస్సు

మహిళా రక్షణ చట్టాలపై అవగాహన పెంచుకోవాలి - జెండర్ స్పెషలిస్ట్ సునీత

బిజినపల్లి (నాగర్ కర్నూల్): మహిళలకు రక్షణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని జెండర్ స్పెషలిస్ట్ సునీత అన్నారు. శుక్రవారం మండల తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ రవికుమార్ ఆధ్వర్యంలో మహిళా చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పని ప్రదేశాల్లో మహిళలపై జరిగే లైంగిక వేధింపుల నివారణకు రూపొందించిన POSH Act-2013 చట్టంపై సంక్షేమ అధికారి వివరించారు. మహిళలను అనుచితంగా తాకడం, అసభ్యకర మాటలు, ఫోటోలు, లైంగిక ప్రయోజనం కోసం ఒత్తిడి చేయడం, ఇబ్బందికర చూపులు, సోషల్ మీడియాలో వేధింపులకు గురైతే సంక్షేమ అధికారికి ఫోన్ లేదా నేరుగా సంప్రదించవచ్చన్నారు.డిప్యూటీ తహసీల్దార్ రవికుమార్ మాట్లాడుతూ మహిళలను గౌరవించినప్పుడే మన సంస్కృతిని గౌరవించినట్లు అవుతుందన్నారు. వేధింపులకు గురైతే 181 హెల్ప్ లైన్ కు ఫోన్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి లలిత, ఆర్ ఐ రాధా, జీపీఓలు కృష్ణవేణి, పార్వతి, ప్రసన్న, మంజుల, పార్థ, కురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Views: 32

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

నల్గొండ జిల్లాలో దారుణం భార్యను హతమార్చిన భర్త! నల్గొండ జిల్లాలో దారుణం భార్యను హతమార్చిన భర్త!
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మర్రిగూడ పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది  నల్గొండ/మర్రిగూడ:అయ్యో దేవుడా.. ఏడాది కిందట పెద్ద కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆ...
తాడిచెర్ల నుంచి శబరిమలకు భక్తి యాత్ర
హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలను కరీంనగర్ జిల్లాలో కలపాలి
రిజర్వేషన్ ఆమెకు.. రాజ్యం ఆయనకు!
టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమం
పేకాట స్థావరానికి స్థలం కల్పించిన మిట్టల్ జిన్నింగ్ మిల్లు యజమానిపై కేసు నమోదు
రైతుల పంట రుణాలు, వివిధ అప్పులు మాఫీ చేయాలి!!