ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనంపై చర్యలు తీసుకోవాలి.

టేకులపల్లి (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా)

ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనంపై చర్యలు తీసుకోవాలి.

దసరా పండుగ సందర్భంగా కొత్తగూడెంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిమను రావణాసురుడితో పోలుస్తూ దహనం చేశారనే ఆరోపణలపై ఎన్ ఎస్ యు ఐ  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు అజ్మీరా సురేష్ నాయక్‌తో పాటు సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు టేకులపల్లి మండల అధ్యక్షుడు తేజావత్ శంబు నాయక్, జిల్లా కార్యదర్శి బోడా పుణ్య నాయక్ ఆధ్వర్యంలో టేకులపల్లి మండల పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ కు ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, దేశ ప్రధాని నరేంద్ర మోదీని రావణాసురుడితో పోలుస్తూ ప్రతిమను దహనం చేయడం కోట్లాది మంది హిందువుల మనోభావాలను కించపరిచే చర్యగా తాము భావిస్తున్నామని తెలిపారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉన్నప్పటికీ, ప్రజల మనోభావాలను దెబ్బతీసే చర్యలపై చట్టప్రకారం విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులుగా తేలిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బోడా పుణ్య నాయక్, గిరిజన మోర్చా జిల్లా నాయకులు రవి రాథోడ్, జిల్లా కౌన్సిల్ మెంబర్ తరావత్ బాలాజీ నాయక్, జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు బోడా గంగానాయక్, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి బోడా నవీన్ నాయక్, మండల సీనియర్ నాయకులు చిక్కా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News