క్యూర్ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణమే లక్ష్యం: మంత్రి పొంగులేటి

*మూడు విడతల్లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం.. ఈ నెలాఖరులోగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి

క్యూర్ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణమే లక్ష్యం: మంత్రి పొంగులేటి

 హైదరాబాద్: క్యూర్ (CORE Urban Region) పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పేదల ఉపాధికి ఎలాంటి ఆటంకం కలగకుండా, వారు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి అవసరమైన భూములను యుద్ధప్రాతిపదికన గుర్తించాలని అధికారులను ఆదేశించారు.

శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు, ఆర్డీవోలు, హౌసింగ్ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం, తదుపరి విడతలకు అవసరమైన భూముల గుర్తింపు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్, హౌసింగ్ శాఖ కార్యదర్శి వి.పి. గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.మూడు విడతల్లో లక్ష ఇళ్ల నిర్మాణం* క్యూర్ పరిధిలో మొత్తం లక్ష ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు. మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి సుమారు 500 ఇళ్ల చొప్పున నిర్మాణాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. మొదటి విడత నిర్మాణాలకు అవసరమైన స్థలాల గుర్తింపును వేగవంతం చేయడంతో పాటు, రెండో, మూడో విడతల్లో చేపట్టే నిర్మాణాలకు కూడా ముందుగానే భూములను గుర్తించి సిద్ధంగా ఉంచాలని కలెక్టర్లను ఆదేశించారు.ఇళ్ల నిర్మాణానికి అనువైన స్థలాల ఎంపికలో భూముల లభ్యత, ఇతర సాంకేతిక అంశాలను పరిశీలించాలని సూచించారు. ప్రభుత్వ భూములను పరిరక్షిస్తూ, నిర్మాణాలకు అవసరమైన భూములను గుర్తించాలని స్పష్టం చేశారు. భూముల గుర్తింపు నుంచి నిర్మాణాల ప్రారంభం వరకు నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికతో అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ఎంపికలో పారదర్శకత హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల్లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అర్హులైన వారికి న్యాయం జరిగేలా ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.హౌసింగ్ కార్పొరేషన్ రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి లబ్ధిదారుల ఎంపిక కోసం ఆన్‌లైన్ డ్రా నిర్వహించాలని తెలిపారు. మూడు జిల్లాల్లోనూ ఒకే విధానాన్ని అనుసరించి, లబ్ధిదారుల వివరాలను సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేయడం ద్వారా ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని ఆదేశించారు.యూట్యూబ్‌లో ఎప్పుడైనా వివరాలు చూసుకునే అవకాశండబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక డ్రాను ప్రత్యక్ష ప్రసారం చేసేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. ప్రత్యక్షంగా వీక్షించలేని వారు సైతం యూట్యూబ్‌లో డ్రాకు సంబంధించిన వివరాలను ఎప్పుడైనా పరిశీలించుకునే అవకాశం కల్పించాలని తెలిపారు. తద్వారా లబ్ధిదారులు తమ పేర్లు ఎంపిక జాబితాలో ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చని వివరించారు.పేదలకు సొంత ఇల్లు అందించడమే లక్ష్యంముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా పేదల జీవనోపాధికి ఇబ్బందులు కలగకుండా, వారు నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే ఇళ్లు నిర్మించి అందించేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ టవర్స్ కార్యక్రమాన్ని చేపట్టిందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.పేదలకు సొంత ఇంటి సౌకర్యం కల్పించేందుకు అధికారులు పూర్తి బాధ్యతతో పనిచేయాలని, భూముల గుర్తింపు, లబ్ధిదారుల ఎంపిక, నిర్మాణాల ప్రణాళిక వంటి ప్రతి అంశాన్ని నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు.

Views: 20

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

నల్గొండ జిల్లాలో దారుణం భార్యను హతమార్చిన భర్త! నల్గొండ జిల్లాలో దారుణం భార్యను హతమార్చిన భర్త!
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మర్రిగూడ పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది  నల్గొండ/మర్రిగూడ:అయ్యో దేవుడా.. ఏడాది కిందట పెద్ద కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆ...
తాడిచెర్ల నుంచి శబరిమలకు భక్తి యాత్ర
హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలను కరీంనగర్ జిల్లాలో కలపాలి
రిజర్వేషన్ ఆమెకు.. రాజ్యం ఆయనకు!
టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమం
పేకాట స్థావరానికి స్థలం కల్పించిన మిట్టల్ జిన్నింగ్ మిల్లు యజమానిపై కేసు నమోదు
రైతుల పంట రుణాలు, వివిధ అప్పులు మాఫీ చేయాలి!!