జేఎన్టీయూహెచ్ సుల్తాన్‌పూర్‌లో జాతీయ విద్యా విధానం

2020 పై అవగాహన సదస్సు

జేఎన్టీయూహెచ్ సుల్తాన్‌పూర్‌లో జాతీయ విద్యా విధానం

చౌటకూర్,: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని జేఎన్టీయూహెచ్ ఇంజినీరింగ్ కళాశాల, సుల్తాన్‌పూర్‌లో జాతీయ విద్యా విధానం (ఎన్ఈపి)-2020 ప్రారంభమై ఆరు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గురువారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాశాలలోని ఇన్‌స్టిట్యూషన్ ఇన్నోవేషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఎన్‌ఈపీ-2020 ప్రాధాన్యత, దాని లక్ష్యాలు, విద్యార్థులకు లభించే అవకాశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బహుళశాఖల విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, పరిశోధన-ఆవిష్కరణలు, అంతర్జాతీయ స్థాయి పరిజ్ఞానం, డిజిటల్ విద్య వంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు కేవలం సాంకేతిక పరిజ్ఞానానికే పరిమితం కాకుండా, పరిశోధనలు, నూతన ఆవిష్కరణలు మరియు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని వక్తలు వివరించారు. నైపుణ్యాలు, ఆవిష్కరణలకే ప్రాధాన్యం: ప్రిన్సిపాల్ డా. ఎస్. విశ్వనాథరాజు కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎస్. విశ్వనాథరాజు మాట్లాడుతూ.."జాతీయ విద్యా విధానం–2020 విద్యార్థులను కేవలం డిగ్రీలకే పరిమితం చేయకుండా, నైపుణ్యా లు, ఆవిష్కరణలు, పరిశోధనా దృక్పథం కలిగిన భవిష్యత్ నాయకులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూపొందించబడింది" అని తెలిపారు. బహుళశాఖల విద్య, అనుభవాత్మక అభ్యాసం పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన శిక్షణ, డిజిటల్ విద్యకు ఈ విధానం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విద్యార్థులు ఎన్‌ఈపీ ద్వారా లభిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని, సాంకేతిక రంగంలో ముందంజలో నిలవాలని, పరిశోధనలు అంకుర సంస్థల  స్థాపన వైపు అడుగులు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇంజినీర్ల తీర్చిదిద్దడంలో కీలక పాత్ర: డా. ఎం. శైలజ ఇన్‌స్టిట్యూషన్ ఇన్నోవేషన్ కౌన్సిల్ అధికారి డా. ఎం. శైలజ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో ఎన్‌ఈపీ-2020పై అవగాహన పెంపొందించడంతో పాటు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యవంతమైన ఇంజినీర్లను తీర్చిదిద్దడంలో ఈ విద్యా విధానం కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల బోధనా, బోధనేతర సిబ్బందితో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి-జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులకు సి.ఎస్. ఆదేశం భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి-జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులకు సి.ఎస్. ఆదేశం
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏవిధమైన ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకుండా తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు...
కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు చేరువ చేయాలి
ఓపెన్ స్కూల్ ప్రవేశాలపై అవగాహన కార్యక్రమం
వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి..
భారీ వర్షాలతో ఉట్నూర్–మత్తడిగూడ వాగుపై రాకపోకలు నిలిచివేత
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన గోలి సంతోష్
చక్రియాల గ్రామంలో ఘనంగా బోనాల ఉత్సవాలు