పునరావాస కేంద్రం ఏర్పాటు
మందమర్రి, (మంచిర్యాల) : శిథిలావస్థలో ఉన్న ఇంటి యజమానులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసినట్లు కమిషనర్ మురళీకృష్ణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక సింగరేణి ఠాగూర్ స్టేడియం యోగా హాల్ కేటాయించామన్నారు. అలాగే 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వర్షాకాలం దృష్ట్యా అపార్ట్మెంట్,కమర్షియల్ బిల్డింగ్స్,సెల్లార్స్,లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి ఇంటి యజమానులు తమ కరెంటు మీటర్లు,వైర్లను మొదటి ఫ్లోర్ కు మార్చుకోవాలని సూచించారు. పై నిబంధనలను ఉల్లంఘించిన వారిపై మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారం తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
30 Jul 2026 19:28:17
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏవిధమైన ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకుండా తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు...
