నల్లబెల్లి ముద్దుబిడ్డ పెద్ది సుదర్శన్ రెడ్డి ఇకలేరు.
డివిజన్ వ్యాప్తంగా విషాదఛాయలు
నల్లబెల్లి (వరంగల్ జిల్లా):నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, నల్లబెల్లి గ్రామ ముద్దుబిడ్డ పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం నర్సంపేట డివిజన్‌తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా, యావత్ తెలంగాణను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది.మలిదశ తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన సుదర్శన్ రెడ్డి ప్రజల మనిషిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించిన ఆయన, నర్సంపేట ఎమ్మెల్యేగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. నిరాడంబరత, నిబద్ధత, ప్రజల పట్ల అంకితభావంతో రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. నల్లబెల్లి గ్రామంలో జన్మించి రాష్ట్రస్థాయి నాయకుడిగా ఎదిగిన ఆయన మరణవార్త తెలియగానే గ్రామమంతా శోకసంద్రంగా మారింది. "మా ఊరి ముద్దుబిడ్డను కోల్పోయాం" అంటూ గ్రామస్థులు, అభిమానులు, ఉద్యమ సహచరులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆయన ఇంటి వద్ద విషాద వాతావరణం నెలకొనగా, చివరిసారిగా తమ అభిమాన నాయకుడిని చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం నర్సంపేట నియోజకవర్గానికే కాదు, తెలంగాణ రాజకీయాలకు, ఉద్యమ చరిత్రకు తీరని లోటని వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, ఉద్యమకారులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నాయకుడిగా ఆయన సేవలు ఎప్పటికీ స్మరణీయంగా నిలిచిపోతాయని పలువురు నివాళులర్పించారు.
Views: 11
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
31 Jul 2026 18:20:28
వరంగల్ / నర్సంపేట : తెలంగాణ ఉద్యమ క్షేత్రంలో.. నర్సంపేట రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల...
