ఓటరు జాబితాను పరిశీలించండి
వైస్ చైర్మన్ రాగంశెట్టి సత్యనారాయణ
బెల్లంపల్లి / మంచిర్యాల : బెల్లంపల్లి పట్టణంలోని 17వ వార్డులో ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమాన్ని మునిసిపల్ వైస్ చైర్మన్, 17వ వార్డు కౌన్సిలర్ రాగంశెట్టి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు ఓటరు జాబితాను పరిశీలించి, పేర్లు లేదా ఇతర వివరాల్లో తప్పులు ఉంటే సరిచేసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.కార్యక్రమంలో వార్డు అధికారి ఉదయ్, ఆర్పీ రాజలక్ష్మి, వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు, బస్తీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Views: 5
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
27 Aug 2026 17:04:38
నల్లగొండ/మర్రిగూడ మండలం: మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల దామెర భీమనపల్లిలో రాఖీ పౌర్ణమి సందర్భంగా వినూత్నంగా ప్రకృతి రాఖీ ఉత్సవం నిర్వహించారు.ప్రకృతిలో సహజంగా లభించే చెట్ల ఆకులు,...
