ప్రభుత్వం వెంటనే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
జిల్లా అధ్యక్షులు గుర్రం మోహన్ రెడ్డి
జన్నారం : రాష్ట్రంలోని పేద రెడ్ల కుటుంబాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రెడ్డి సంక్షేమ సంఘం మంచిర్యా ల జిల్లా అధ్యక్షులు గుర్రం మోహన్ రెడ్డి కోరారు. గురు వారంరోజున జన్నారం మం డలకేంద్రంలో జరిగిన రెడ్డి సంక్షేమ సంఘం సమావే శంలో ఆయన మాట్లాడు తూ రెడ్డి అంటేనే సంపన్ను లు అనుకుంటారని కానీ రెడ్డి సామాజిక వర్గంలో సై తం అనేక మంది పేదరి కంలో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు ద్వా రా పేదరికంలో వున్న రెడ్డిల కు ఉపాధి, ఆర్థిక, వ్యవసా య రంగాల్లో చేయూత లభిస్తుందని పేద రెడ్డిల కుటుంబాలన్నీఅభివృద్ధి చెందేందుకు కార్పొరేషన్ ఎంతగానో ఉపయోగప డుతుందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పం దించి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్ర మంలో రెడ్డి సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు ఏనుగు సుభాష్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు సామ ప్రభాకర్ రెడ్డి, పలు వురు రెడ్డి కులస్తులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


