సీనియర్ జడ్పీటీసీ సారయ్య మృతి పట్ల ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తీవ్ర సంతాపం
సారయ్య పార్థివదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే
మాజీ కార్పొరేటర్ తూర్పటి సులోచన గారి భర్త, సీనియర్ జడ్పీటీసీ సభ్యులు సారయ్య గారు మృతి చెందడం పట్ల వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సారయ్య మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. సారయ్య మృతి వార్త తెలుసుకున్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వారి నివాసానికి వెళ్లి పార్థివదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ... సారయ్య మృతి బాధాకరమని, వారి కుటుంబానికి ఇది తీరని లోటని పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, వారికి మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. సారయ్య ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ఈ బాధను తట్టుకునే శక్తిని ప్రసాదించాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో వరంగల్ డీసీసీ అధ్యక్షులు మహమ్మద్ అయూబ్, 14 వ డివిజన్ అధ్యక్షులు సయ్యద్ ఇంతియాజ్, డివిజన్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


