బోరిగాం గ్రామంలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మాజీ ఎంపీ సోయం బాపూరావు, డి సి సి అధ్యక్షుడు నరేశ్ జాదవ్

50 లక్షల నిధులతో నిర్మించనున్న మహిళ సంఘం భవనం, సీసీ రోడ్డు, కల్వర్ట్ లకు భూమి పూజ

బోరిగాం గ్రామంలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మాజీ ఎంపీ సోయం బాపూరావు, డి సి సి అధ్యక్షుడు నరేశ్ జాదవ్

ఆదిలాబాద్ బ్యూరో అక్టోబర్ 22( విజన్ ఆంధ్ర)ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం లోని బోరిగాం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమలకు మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్లే, రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపూరావు , జిల్లా అధ్యక్షులు నరేష్ జాదవ్, గ్రామ సర్పంచ్ అసిఫ్ ఖాన్ లతో కలిసి భూమి పూజ చేశారు. ప్రజా ప్రభుత్వం మహిళ సంఘానికి 10 లక్షల నిధులు,సీసీ రోడ్డు 10, కల్వర్ట్ 30 లక్షల నిధులు మంజూరు చెయ్యగా ఈరోజు కోబ్బరి కాయలు కొట్టి భూమి పూజ చేశారు. ముందుగా గ్రామానికి చేరుకున్న నాయకులకు గ్రామస్తులుడప్పు చప్పుళ్లతో ఘన స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం గ్రామంలోని ఆలయంలో పూజలు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందని  గ్రామల్లో రోడ్లు డ్రైనేజిలు విద్య వైద్యం విద్యుత్ తాగు సాగు నిరూపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేస్తుందన్నారు. గత ప్రభుత్వం పది యేండ్లలో ఏఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వకుండా మోసం చేసిందని కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత బస్సు, రైతులకు రుణమాఫీ, లాంటి ఎన్నో సంక్షేమ పతకాలు ప్రవేశపెట్టి ఆదుకుంటుందన్నారు. వచ్చే పది యేండ్లు కాంగ్రెస్ పార్టీనే తెలంగాణ లో అధికారంలో ఉండడం ఖాయమన్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News