విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు గురించి ఆలోచించాలి

విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు గురించి ఆలోచించాలి

చర్ల,(భద్రాద్రి కొత్తగూడెం జిల్లా): చర్ల మండలంలోని దానవాయిపేట మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశం ఎంతో ఉత్సాహంగా జరిగింది, ఈ సందర్భంగా పిల్లల విద్యా ప్రగతి మరియు వారి భవిష్యత్తు గురించి విస్తృతమైన చర్చ జరిగింది, సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విద్యా కమిటీ చైర్మన్ కణితి రజని మాట్లాడుతూ తల్లిదండ్రుల బాధ్యతను గుర్తు చేశారు, పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ప్రతిరోజూ వారిని సకాలంలో బడికి పంపాలని, సాయంత్రం వేళల్లో పిల్లలతో సమయాన్ని కేటాయించి వారి హోంవర్క్ చేయించాలని సూచించారు ,కేవలం చదువు మాత్రమే కాకుండా పిల్లలకు చిన్నతనం నుండే క్రమశిక్షణను అలవాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె పేర్కొన్నారు, పాఠశాలలో ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజనం మరియు పౌష్టికాహారం నాణ్యంగా అందుతున్నాయని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పాఠశాల ఉపాధ్యాయులు చింతకాయల హరిబాబు మరియు పూర్ణిమ మాట్లాడుతూ విద్యార్థుల వ్యక్తిగత ప్రవర్తన, అభ్యాసన సామర్థ్యాలను తల్లిదండ్రులకు వివరించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక దృష్టి సారించడం మరియు మెరుగైన ఫలితాల కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి తల్లిదండ్రులతో చర్చించారు, ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, అధిక సంఖ్యలో తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు, పిల్లలు కూడా ఉత్సాహంగా పాలుపంచుకోవడంతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. 
Views: 33

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రభుత్వ హాస్పిటళ్ల పనితీరు మెరుగు-ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రభుత్వ హాస్పిటళ్ల పనితీరు మెరుగు-ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
ప్రభుత్వ హాస్పిటళ్ల పనితీరు మెరుగుపడిందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. మెరుగైన వైద్య సేవలు అందిస్తుండడంతో, ప్రభుత్వ హాస్పిటళ్లకు వచ్చే సంఖ్య కూడా పెరుగుతోందని మంత్రి...
ఆహార, ఔషధాల్లో కల్తీల నిరోధానికి కఠిన చట్టం-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
నాణ్యమైన విద్య, క్రమశిక్షణకు చిరునామా కేజీబీవీ 
శుభ్రతతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం
దౌల్తాబాద్ తాండాలో డెంగ్యూపై అప్రమత్తత చర్యలు
కొనాయిపల్లిలో ఘనంగా అక్షరాభ్యాసం కార్యక్రమం
19న జిల్లాస్థాయి తైక్వాండో ఛాంపియన్ సిప్ పోటీలు