న్యాల్కల్ ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం
సంగారెడ్డి జిల్లా. న్యాల్కల్: న్యాల్కల్ మండల కేంద్రంలో మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎనికైనవరికి ఉపాధ్యాయలకి శుక్రవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో మండల విద్యాధికారి, మండల అభివృధి అధికారి ఘనంగా సన్మానిచ్చారు. ఈ కార్యక్రమానికి న్యాల్కల్ మండల విద్యాధికారి అధ్యక్షత వహించగా, మండల అభివృద్ధి అధికారి మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. నేటి విద్యార్థులే దేశ భవిష్యత్తు వారి చేతుల్లో ఉందని పేర్కొన్నారు. ఉపాధ్యాయు ల సేవలను కొనియాడుతూ, విద్యార్థుల అభ్యున్నతికి వారు చేస్తున్న కృషి అభినందనీయమని కార్యక్రమంలో వక్తలు పేర్కొన్నారు ఉపాధ్యాయుల సేవలు ప్రతి విద్యార్థి జీవితంలో మర్చిపోని సంఘటన ప్రతి ఒక్కరూ ఉపాధ్యాయులను గుర్తుంచుకుం టారని ఈ సందర్భంగా తెలియజేశారు. మండలంలోని అన్ని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పాల్గొని ఉపాధ్యాయులను అభినందించారు. విద్యారంగంలో విశిష్ట సేవలు అందించిన 23 మంది ఉపాధ్యాయులను మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసి పురస్కారాలతో సత్కరించారు. ఈ సందర్భంగా న్యాల్కల్ జిల్లా పరిషత్ పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల న్యాల్కల్ పాఠశాల నుండి మొగులయ్య సర్ మరియు సునీతారాణి మేడమ్ మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై పురస్కారాలు అందుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల న్యాల్కల్ ప్రధానోపాధ్యాయులు శ్రీ సచిదానంద రెడ్డి గారు మరియు పాఠశాల ఉపాధ్యాయులు ఇద్దరినీ హృదయపూర్వకంగా అభినందించారు. వారి సేవలు, అంకితభావం ఇతర ఉపాధ్యాయులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


