మర్రిగూడలో 26 మందికి రూ.9.54 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
నల్గొండ/మర్రిగూడ: అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద,మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కొండంత అండగా నిలుస్తోందని మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామదాసు శ్రీనివాస్ పేర్కొన్నారు. మర్రిగూడ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను మంగళవారం లబ్ధిదారులకు అందజేశారు. మండలానికి చెందిన 26 మంది లబ్ధిదారులకు రూ. 9,54,500 విలువైన చెక్కులను రామదాసు శ్రీనివాస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు సకాలంలో వైద్య సాయం అందేలా సీఎంఆర్‌ఎఫ్ నిధులు మంజూరు చేయించడంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కృషి అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మేతరి యాదయ్య,మాల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నక్క శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ యూత్ మండల అధ్యక్షుడు కోడల అల్వాల్ రెడ్డి, సర్పంచులు ఐతగోని రేణుక గౌడ్ వెంకన్న, లపంగి నరసింహ, సిరసనవాడ భిక్షమయ్య, జిల్లా అలివేలు కృష్ణయ్య, రమావత్ లక్ష్మణ్, విజయలక్ష్మి, గునగంటి సంగీత నరసింహలతో పాటు పార్టీ నాయకులు మాస శేఖర్, వెంకటంపేట బాలయ్య, డైరెక్టర్ జమ్ముల వెంకటేష్ గౌడ్, జంగిలి రవి, బాయికాడి కొండల్, ఉడుగు శ్రీను, జాల వెంకటయ్య, కొలుకులపల్లి జంగయ్య, ఉడుగు అంజయ్య, సిరిపంగి శ్రీను, పోనుగోటి శేఖర్, ఇదగోని కృష్ణయ్య, గ్యార వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


