ఇందిరా గాంధీకి ఘన నివాళులు అర్పించిన సర్పంచ్ కొండ రాజమ్మ

ఇందిరా గాంధీకి ఘన నివాళులు అర్పించిన సర్పంచ్ కొండ రాజమ్మ

మల్హర్  :  మాజీ ప్రధానమంత్రి, భారతరత్న ఇందిరా గాంధీ జయంతి వేడుకలను గురువారం మల్హర్ మండలం కొయ్యూరు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ల ఫోరం అధ్యక్షురాలు కొండ రాజమ్మ, గ్రామ శాఖ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొని ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా కొండ రాజమ్మ మాట్లాడుతూ దేశ అభివృద్ధితో పాటు పేద ప్రజల సంక్షేమానికి ఇందిరా గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. సామాన్య ప్రజల అభ్యున్నతిని లక్ష్యంగా చేసుకుని ఆమె తీసుకున్న నిర్ణయాలు, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయని పేర్కొన్నారు. ఇందిరా గాంధీ ఆశయాలను కొనసాగిస్తూ ఆమె స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ప్రజాసేవలో ముందుండాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాజసమ్మయ్య, మల్హర్ మండల ప్రధాన కార్యదర్శి తేప్పల రజిత, వేన్నపు రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బొమ్మ మల్లారెడ్డి, రమణ చారి, మాజీ డైరెక్టర్ కొండ సమ్మయ్య, రామచంద్రు, రాజిరెడ్డి, రాజబాబు, యూత్ అధ్యక్షుడు లాకావత్ రాజేందర్, మాజీ యూత్ అధ్యక్షుడు పెరుమళ్ళ మల్లేష్, నాయకులు శ్రీనివాస్, మహేందర్, శ్రావణ్ కుమార్, రాధాకృష్ణ, మూడో వార్డు సభ్యురాలు వేల్పుల సారమ్మ, ఆరో వార్డు సభ్యుడు పంతకాని శశివర్ధన్, మాజీ ఉపసర్పంచ్ మమత, మహిళా నాయకురాళ్లు రమాదేవి, మణింద్ర, కుసుమలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News