సాలూర ప్రభుత్వ పాఠశాలలకు యోగ గ్రీన్ మ్యాట్ ల అందజేత.

ఫోటో రైటప్ : గ్రీన్ మాట్లను అందిస్తున్న దాత ఇల్తెపు శంకర్ సార్.

సాలూర ప్రభుత్వ పాఠశాలలకు యోగ గ్రీన్ మ్యాట్ ల అందజేత.

సాలూర : సాలూర మండల కేంద్రంలోని ఉన్నటువంటి 4 ప్రభుత్వ పాఠశాలలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,పిఆర్టియు జిల్లా మాజీ అధ్యక్షులు,లయన్స్ క్లబ్ ఆచన్ పల్లి టార్టల్ ఇల్తెపు శంకర్ సహకారంతో లయన్స్ క్లబ్ ఆచన్ పల్లి ఆధ్వర్యంలో శుక్రవారం యోగ గ్రీన్ మ్యాట్లను అందజేశారు.ఈ సందర్భంగా దాత మాట్లాడుతూ విద్య,వైద్య పరంగా సేవలను అందించడానికి లయన్స్ క్లబ్ ఆచన్ పల్లి తరపున సహాయ సహకారాలు అందించడానికి ఎల్లవేళలా ముందుంటామన్నారు.ఎంఈఓ,ఉపాధ్యాయుల కోరిక మేరకు మండలంలోని మిగతా 11 ప్రభుత్వ పాఠశాలలకు సైతం యోగా గ్రీన్ మ్యాట్లను ఇవ్వడానికి క్లబ్ ప్రతినిధులు ఉపాధ్యాయులకు హామీ ఇచ్చారు.పేద విద్యార్థులకు ఎల్లవేళలా లయన్స్ క్లబ్ ఆచన్ పల్లి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సొక్కం లావణ్య రవి,ఎంఈఓ రాజీ మంజుష,ఏఎంసి డైరెక్టర్ లక్ష్మణ్ పటేల్,హున్సా సాలూర సొసైటీల చైర్మన్లు మందర్న రవి,అల్లె రమేష్,సీనియర్ నాయకులు సొక్కం రవి,పిఆర్టియు మండల అధ్యక్షులు కల్లూరి శంకర్,కార్యదర్శి లక్ష్మణ్,క్లబ్ అధ్యక్షులు వై.దుర్గారావు,సెక్రటరీ వై.రమణారెడ్డి,ట్రెజరర్ కైలాస్ అప్ప,సీనియర్ ప్రతినిధి చక్రవర్తి,ఉపాధ్యాయ బృందం,విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Views: 37

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News