కైలాసం గుట్టకు భక్తులకు తాగునీటి సౌకర్యం

కార్తీక మాసం నేపథ్యంలో నూతన బోర్ మోటార్ ఏర్పాటు

కైలాసం గుట్టకు భక్తులకు తాగునీటి సౌకర్యం

భక్తులకు మౌలిక వసతుల కల్పనే లక్ష్యం : మున్సిపల్ చైర్‌పర్సన్ బృంగి రత్నమాల

కల్వకుర్తి : కల్వకుర్తి పట్టణ పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కైలాసం గుట్ట వద్ద భక్తుల తాగునీటి సౌకర్యార్థం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన బోర్ మోటార్‌ను శనివారం మున్సిపల్ చైర్‌పర్సన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పవిత్ర కార్తీక మాసంలో ఆలయానికి వచ్చే భక్తులు, శివస్వాములు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందస్తుగా ఈ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులకు అవసరమైన కనీస మౌలిక వసతులు కల్పించడమే తమ ప్రాధాన్యత అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ పసుల రమాకాంత్ రెడ్డి, నాయకులు శేఖర్ రెడ్డి, పురం మహేశ్వర్ రెడ్డి, రఘు, బాల్‌రాజ్, దున్న భాస్కర్, పడకంటి వెంకటేష్, దున్న సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Views: 17

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సైబర్ క్రైమ్‌పై అవగాహన కార్యక్రమం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సైబర్ క్రైమ్‌పై అవగాహన కార్యక్రమం
కొత్తగూడెం బ్యూరో : డిజిటల్ మోసాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి.. వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఓటీపీలు ఇతరులతో పంచుకోవద్దని కొత్తగూడెం సబ్ ఇన్‌స్పెక్టర్ జుబేదా...
దీపావళి వేడుకల్లో తగు జాగ్రత్తలు పాటించాలి: యువత, చిన్నారులు అప్రమత్తంగా ఉండాలి – పుల్కల్ ఎస్ఐ విశ్వజన్
డీఈవో చేతుల మీదుగా బహుమతులు అందుకున్న సిద్ధార్థ విద్యార్థులు
మోడల్ స్కూల్ లో పోస్టుల భర్తీకి దరఖాస్తు ఆహ్వానం
మునుగోడులో ఘనంగా సుంకరి బిక్షం గౌడ్ విరమణ వేడుక.
చేగుంట బస్టాండ్ దుస్థితి మార్చే వారే లేరా
ప్రతి ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వెలుగులు నింపాలి