కోటపల్లి KGBVలో విద్యా మౌలిక వసతులకు రూ.65 లక్షలు

విద్య, వైద్యం, సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట

కోటపల్లి KGBVలో విద్యా మౌలిక వసతులకు రూ.65 లక్షలు

శక్తి, గనుల శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి

కోటపల్లి  : విద్య, వైద్యం, సంక్షేమం, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని శక్తి, గనుల శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. కోటపల్లి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV)లో రూ.65 లక్షల వ్యయంతో అదనపు తరగతి గదులు, టాయిలెట్లు, బాత్‌రూమ్‌ల నిర్మాణానికి శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. అదేవిధంగా రూ.90 లక్షలతో ఎస్సీ హాస్టల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించి, నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. చెన్నూరు నియోజకవర్గంలోని సోమనపల్లిలో రూ.200 కోట్ల వ్యయంతో 2,000 మంది విద్యార్థులకు హాస్టల్ వసతితో కూడిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. కోటపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో త్వరలో బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 లక్షల మంది విద్యార్థులకు పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని మంత్రి వివరించారు. విద్యా రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సైబర్ క్రైమ్‌పై అవగాహన కార్యక్రమం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సైబర్ క్రైమ్‌పై అవగాహన కార్యక్రమం
కొత్తగూడెం బ్యూరో : డిజిటల్ మోసాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి.. వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఓటీపీలు ఇతరులతో పంచుకోవద్దని కొత్తగూడెం సబ్ ఇన్‌స్పెక్టర్ జుబేదా...
దీపావళి వేడుకల్లో తగు జాగ్రత్తలు పాటించాలి: యువత, చిన్నారులు అప్రమత్తంగా ఉండాలి – పుల్కల్ ఎస్ఐ విశ్వజన్
డీఈవో చేతుల మీదుగా బహుమతులు అందుకున్న సిద్ధార్థ విద్యార్థులు
మోడల్ స్కూల్ లో పోస్టుల భర్తీకి దరఖాస్తు ఆహ్వానం
మునుగోడులో ఘనంగా సుంకరి బిక్షం గౌడ్ విరమణ వేడుక.
చేగుంట బస్టాండ్ దుస్థితి మార్చే వారే లేరా
ప్రతి ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వెలుగులు నింపాలి