సీఎస్ఐ పాఠశాల విద్యార్థులకు 12 బెంచీలు విరాళం
ఎంఈఓ తిరుపతి, కౌన్సిలర్ దివ్య చేతుల మీదుగా ప్రారంభం
ములుగు : ములుగు జిల్లా కేంద్రంలోని సీఎస్ఐ సోమసుందరం మెమోరియల్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు సాయి కిరణ్, ఆస్ట్రేలియా ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో 12 బెంచీలు, సుమారు రూ. 55,000 విలువైన విరాళం అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ములుగు మండల విద్యాశాఖ అధికారి వజ్జ తిరుపతి, వార్డు కౌన్సిలర్ గుగ్గిళ్ళ దివ్య సంయుక్తంగా బెంచీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఈఓ వజ్జ తిరుపతి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. విద్యార్థుల సౌకర్యాల కోసం ఎప్పుడూ ముందుండే తిరుపతి, పాఠశాలల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నారని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కొనియాడారు. వార్డు కౌన్సిలర్ గుగ్గిళ్ళ దివ్య మాట్లాడుతూ, పిల్లల చదువుకు అవసరమైన ప్రతి సౌకర్యం కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. వార్డులోని పాఠశాలల అభివృద్ధిపై దివ్య చూపుతున్న చొరవ, పిల్లల పట్ల చూపుతున్న శ్రద్ధను అందరూ ప్రశంసించారు. దాతల సహకారంతో పాఠశాల మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ఉపాధ్యాయుడు రమేష్‌ను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు బలరాం, ఉపాధ్యాయులు రతన్ తదితరులు, విద్యార్థులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


