చలికాలంలో గుండెపోటు ముప్పు ఎక్కువ.. గుండె సంబంధిత సమస్యలున్న వారు అప్రమత్తంగా ఉండాలి
జిల్లా నాగర్ కర్నూల్ : చలికాలంలో గుండెపోటు (హార్ట్ ఎటాక్), గుండె వైఫల్యం (హార్ట్ ఫెయిల్యూర్) ముప్పు పెరిగే అవకాశం ఉందని యశోద ఆసుపత్రి సికింద్రాబాద్‌కు చెందిన కార్డియాలజిస్ట్ ప్రణీత్ పొలమురి తెలిపారు.నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రైవేటు హోటల్‌లో పత్రిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్ సమస్యలు, గతంలో గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు చలికాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.చలికాలంలో శరీర ఉష్ణోగ్రతను కాపాడుకునేందుకు రక్తనాళాలు కుంచించుకుపోతాయని, దీంతో రక్తపోటు పెరిగి గుండెపై అదనపు భారం పడుతుందని తెలిపారు.ఇప్పటికే గుండె సమస్యలు, గుండె పంపింగ్ సామర్థ్యం తక్కువగా ఉన్నవారు, రక్తనాళాల్లో బ్లాకేజీలు ఉన్నవారికి ఈ అదనపు ఒత్తిడి ప్రమాదకరంగా మారే అవకాశం ఉందన్నారు.చలికాలంలో నీటి వినియోగం తగ్గడం వల్ల శరీరంలో నీటి లోపం ఏర్పడి రక్తం చిక్కబడే పరిస్థితులు ఉండవచ్చని, తద్వారా రక్తం గడ్డకట్టే ప్రమాదం పెరిగే అవకాశం ఉందన్నారు.అలాగే చలిని తట్టుకునేందుకు కొందరు పొగతాగడం, మద్యం సేవించడం పెంచుతారని, ఇవి గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు.చలి నుంచి రక్షణ, క్రమం తప్పకుండా మందులు, వైద్య పరీక్షలు తప్పనిసరని సూచించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

