మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి చేతుల మీదుగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
పెద్ద శంకరంపేట్ : పెద్ద శంకరంపేట్, మండల గ్రామాల అనారోగ్య బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన వైద్య ఖర్చుల చెక్కులను మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి అందజేశారు.పెద్ద శంకరంపేట్ మండలం శివాయపల్లికి చెందిన సంగయ్యకు రూ.29,000, టెంకట్టికి చెందిన కోణం లచ్చమ్మకు రూ.15,000, మల్కాపురం (గట్టు కింది తండా)కు చెందిన మునోత్ చాందికి రూ.23,000, గుట్టిముక్కలకు చెందిన రాజులుకు రూ.9,500, చొప్పున చెక్కులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్, సురేష్ గౌడ్, అలుగుల సత్యనారాయణ, రమేష్, దత్తు, సుభాష్ చంద్రబోస్, శంకర్ గౌడ్, అంజయ్య, జుక్కల్ సర్పంచ్ శ్యామయ్య, నాందేడ్ శివకుమార్, రాములు, మల్లేశం, ప్రవీణ్, శ్రీశైలం, శ్రీనివాస్, నగేష్ సెట్, గోపాల్, రాజు నాయక్, రవి నాయక్, మాల్గొండ, సద్దాం, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


