నామ మాత్రంగా సాగిన మండల సమావేశం.  అధికారులు ప్రజాప్రతినిధులు డుమ్మా.....

తూతూ మంత్రంగా కొనసాగిన సర్వసభ్య సమావేశం

నామ మాత్రంగా సాగిన మండల సమావేశం.   అధికారులు ప్రజాప్రతినిధులు డుమ్మా.....

 బాన్సువాడ : ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే బాన్సువాడ  మండల సర్వసభ్య సమావేశం శుక్రవారం నామ మాత్రంగా కొనసాగింది. మండల సర్వసభ్య సమావేశానికి అధికారులు ప్రజాప్రతినిధులు దుమ్ము కొట్టడం జరిగింది. అధికారులు ప్రజాప్రతినిధులు సమావేశాలకు రాకుంటే మండల స్థాయి సమస్యలు ఏ విధంగా పరిష్కార మవుతాయని పలువురు ప్రశ్నించారు. ఈ సందర్భం గా మండల అభివృద్ధి అధికారి ఆనంద్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశం లో వ్యవసాయ, అంగన్వాడి, విద్యుత్తు, విద్య, వైద్య ఆరోగ్యశాఖ, ఉపాధి హామీ,  శిశు సంక్షేమ శాఖ తదితర శాఖల అధికారులు తమ మండల ప్రగతి నివేదికల ను సమావేశం లో చదివి వినిపించారు. ముఖ్యంగా అధికారులు గ్రామాల్లో ప్రభుత్వం మంజూరు చేసిన అంగన్వాడి కేంద్రాలు గ్రామ మహిళ సమైక్య భవనాలు నిర్మాణం కోసం గ్రామాల్లో స్థల సేకరణ సేకరించి భవనాలు నిర్మించేందుకు ప్రజాప్రతి నిధులు ముందుకు రావాల్సిందిగా అధికారులు కోరారు. అనంతరం మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు నాందేవ్ మాట్లాడుతూ. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలు తలెత్తినప్పుడు విద్యుత్ సిబ్బంది ఫోన్ చేస్తే స్పందించడం లేదని కిందిస్థాయి అధికారుల కు గ్రామీణ ప్రాంత విద్యుత్ సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు తెలపడంతో వెంటనే స్పందించిన విద్యుత్ అధికారులు తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ఎంపీడీవో, రెవెన్యూ అధికారి మాట్లాడుతూ. ప్రభుత్వము ఎలిమినో ప్రభావం తో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాల్సింది గా ఉన్నంత స్థాయి అధికారులు సూచిస్తున్నారని సమావేశం లో పేర్కొన్నారు. వచ్చే వేసవికాలం ఎదుర్కొనే విధంగా నీటిని పొదుపుగా వాడుకోవాలని ఇప్పటికే సింగర్ ప్రాజెక్టు లో నీరు తగ్గిపోవడం జరిగిందని రాబోయే రోజుల్లో నీటి కొడత లేకుండా గ్రామాల్లో ఇంకుడు గుంతలు ప్రభుత్వం చూపిన చర్యలను పాటిస్తూ సర్పంచులు ఎంపీటీసీలు ముందస్తు ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్లు ఎంపీటీసీలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Views: 30

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News