*ప్రజల కష్టసుఖాల్లో తోడుగా ఉంటాం.. బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చిన డి సి సిఅధ్యక్షుడు డా. నరేష్ జాదవ్

*మృతుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన డీసీసీ అధ్యక్షులు . నరేష్ జాదవ్ * *అనారోగ్యంతో బాధపడుతున్న మహిళను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న డి సి సి అధ్యక్షుడు నరేష్ జాదవ్

*ప్రజల కష్టసుఖాల్లో తోడుగా ఉంటాం.. బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చిన డి సి సిఅధ్యక్షుడు డా. నరేష్ జాదవ్

ఆదిలాబాద్ బ్యూరో : ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో పర్యటించిన ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు *డా. నరేష్ జాదవ్ , మన్నూర్ గ్రామానికి చెందిన కల్లేవాడ్ రామచందర్ గారు గత కొన్ని రోజుల క్రితం పరమపదించిన విషయం తెలుసుకుని, ఈరోజు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మృతికి గల కారణాలు, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం గుడిహత్నూర్ మండల కేంద్రానికి చెందిన టోకరే సాయి తల్లి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న *డా. నరేష్ జాదవ్ వారి నివాసానికి వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు. కష్టసుఖాల్లో ప్రజలకు అండగా ఉంటూ, ప్రతి కుటుంబానికి భరోసా కల్పించడమే తన బాధ్యతగా భావిస్తూ డా. నరేష్ జాదవ్ గారు ప్రజల మధ్య నిరంతరం అందుబాటులో ఉంటున్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు గుడిహత్నూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తొడసం దౌలత్ రావు, శాంతాపూర్ సర్పంచ్ సబ్లే పత్తు సింగ్, ఉప సర్పంచ్ కరాడ్ రవి,మండల ఉపధ్యక్షులు మొయితే మారుతీ, దుబ్బాక నరేష్, సూర్యగూడ సర్పంచ్ రహీం, ఉమ్రి సర్పంచ్ భరత్, మండల మైనార్టీ అధ్యక్షులు సమీర్ ఖాన్, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ నాగ్ నాథ్ అప్ప, కోలారి మాజీ సర్పంచ్ బాలాజీ పటేల్,ఆడే జైపాల్, బ్రహ్మానంద్, కాగ్నే రామ్ కిషన్, శ్యామ్, యోగి, మరియు మండల పిఎసి మెంబర్స్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు బొమ్మారెడ్డిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఎంపిక రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు బొమ్మారెడ్డిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఎంపిక
చౌటకూర్ :  చౌటకూర్ మండలం బొమ్మారెడ్డిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు.ఈ నెల 19న మెదక్‌లో నిర్వహించిన...
అల్లాదుర్గం మండల స్థాయి క్విజ్ పోటీల నిర్వహణ
ప్రతి కుటుంబానికి రూ5 లక్షల భీమా పథకం
తాడిడాన్‌పల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై గ్రామసభ
మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి చేతుల మీదుగా సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
ఇందిరా గాంధీకి ఘన నివాళులు అర్పించిన సర్పంచ్ కొండ రాజమ్మ
కారుపాకల కొమురయ్య మృతికి సర్పంచ్ బండి స్వామి సంతాపం