తాటిచెట్టుపై నుంచి పడి కల్లుగీత కార్మికుడు మృతి
బాల్కొండ : నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం బ్రహ్మణపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ముసలాపురం వేణు గోపాల్ గౌడ్ 41 సంవత్సరాలు వృత్తిరీత్యా కల్లుగీత కార్మికుడిగా గత కొన్ని సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నారు.తాటిచెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా ప్రమాదవశత్తు చెట్టుపై నుంచి కింద పడిపో యారు. ఈ ప్రమాదాన్ని గమనించిన గ్రామస్తులు వెంటనే ఆయనను రక్షించి చికిత్స నిమిత్తం ఆర్మూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్యతో పాటు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. కుటుంబం అత్యంత పేదరికంలో ఉండగా, ఆయన మరణంతో కుటుంబం జీవనాధారాన్ని కోల్పోయి దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది.ప్రభుత్వం వెంటనే స్పందించి మృతుడి కుటుంబానికి తగిన ఆర్థిక పరిహారం అందించాలని, భార్యకు మరియు ముగ్గురు ఆడపిల్లలకు అండగా నిలిచి వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలని గ్రామస్తులు, స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


