అనభేరి సింగిరెడ్డి అమరుల స్మారక హల్ నిర్మాణానికై 2.30 కొట్ల నిధులు మంజూరు పట్ల హర్షం

మంత్రి పొన్నం ప్రభాకర్ కు సిపిఐ నాయకుల కృతజ్ఞతలు

అనభేరి సింగిరెడ్డి అమరుల స్మారక హల్ నిర్మాణానికై   2.30 కొట్ల నిధులు మంజూరు పట్ల హర్షం

హుస్నాబాద్ : నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా విరోచితంగా సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ మృత వీరుల స్మృతి చిహ్నంగా ఉన్న అనభేరి ప్రభాకర్ రావు, సింగిరెడ్డి భూపతి రెడ్డి మరో 10 మంది అమరవీరుల స్మారక భవనం నిర్మాణానికై 2.20 రెండు కొట్ల 30 లక్షల నిధులు విడుదలకు కృషి చేసిన సందర్బంగా హుస్నాబాద్ సిపిఐ హార్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా హుస్నాబాద్ శాసన సభ్యులు రాష్ట్ర రోడ్డు రవాణా బిసి సంక్షేమ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ కు సిపిఐ నేత మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, సిపిఐ కన్వీనర్ జాగీర్ సత్యనారాయణ, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి హుస్నాబాద్ మాజీ వైస్ ఎంపిపి గడిపె మల్లేశ్, మండల సిపిఐ నాయకులు పొదిల కుమారస్వామి, జనగాం రాజ్ కుమార్, గూడ పద్మ, అయిలేని సంజీవరెడ్డి, కాల్వల ఎల్లయ్య, అయిలేని మల్లారెడ్డి,జంగ విజయ, దొంతరవేని రజిత, మహ్మదపుర్, గ్రామ శాఖ సిపిఐ కార్యదర్శి పిట్టల మెగిలయ్య, మాజీ ఎంపిటిసి సభ్యులు పిట్టల సుధకర్,మాజీ సర్పంచ్ పిట్టల కనకలక్ష్మి, సిపిఐ నాయకులు పిట్టల ప్రసాద్, పిట్టల బాలయ్య, దుద్దేడ రాజయ్యతో పాటు అనభేరి, సింగిరెడ్డి అమరుల కుటుంబ సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలిపుతూ హర్షం వ్యక్తం చేశారు.

Views: 8

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News