ఈనెల 26న సీఎం రేవంత్ రెడ్డి రాక అచ్చంపేటలో సభా స్థలాన్ని పరిశీలించిన
అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ. అధికారులు
అచ్చంపేట : ఈనెల 26వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అచ్చంపేట నియోజకవర్గం లోని వివిధ అభివృద్ధి పనులు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసేందుకు రానున్నారు ఈ సందర్భంగా అచ్చంపేట లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు శుక్రవారం అచ్చంపేట వై జంక్షన్ వద్ద అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అధికారులు సభా స్థలాన్ని పరిశీలించారు బహిరంగ సభ ఏర్పాట్లు ముమ్మరంగా నిర్వహించాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ అధికారులను కోరారు సీఎం రేవంత్ రెడ్డి 26వ తేదీన నల్లమల్లలోని మద్దిమడుగు ఆంజనేయస్వామి సన్నిధిలో సేవన్ లాల్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమం లో పాల్గొని సాయంత్రం నాలుగు గంటలకు అచ్చంపేటలో జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొన్నట్లు అధికార వర్గాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గోపాల్ రెడ్డి జిల్లా గ్రంధాలయ చైర్మన్ రాజేందర్ మున్సిపల్ కమిషనర్ మురళి డి.ఎస్.పి శ్రీనివాసులు వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

