సర్కారు దవాఖానాల దుస్థితిపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆగ్రహం
తెలంగాణ సీఎస్‌కు నోటీసులు 4 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం
ఆదిలాబాద్ రిమ్స్ అగ్నిప్రమాదం, వరంగల్ ఎంజీఎం ఘటనలపై సీరియస్
న్యాయవాది వినోద్ హిందుస్థానీ ఫిర్యాదుతో కదిలిన మానవ హక్కుల కమిషన్ నల్గొండ /మర్రిగూడ : తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నెలకొన్న దుస్థితి, మౌలిక సదుపాయాల లేమిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఈ వ్యవహారంపై నాలుగు వారాల్లోగా సమగ్ర 'యాక్షన్ టేకెన్ రిపోర్ట్'v సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశిస్తూ గురువారం నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలోని సర్కారు దవాఖానాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న విషాద ఘటనలు, వైద్య సేవల లోపాలపై నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం కమ్మగూడ గ్రామానికి చెందిన హైకోర్టు న్యాయవాది వినోద్ హిందుస్థానీ ఇటీవల ఎన్‌హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించారు.ఆసుపత్రుల్లో సామాన్యుల ప్రాణాలకు రక్షణ కరవైందని, ఇది తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని ఆయన తన ఫిర్యాదులో కేసు నం. 981/36/0/2026 పేర్కొన్నారు. పసికందుల మృతిపై ఆవేదన ఆదిలాబాద్ రిమ్స్‌లోని స్పెషల్ న్యూబార్న్ కేర్ యూనిట్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోవడాన్ని పిటిషనర్ ప్రముఖంగా ప్రస్తావించారు. ఇచ్చోడకు చెందిన సభా ఖాన్, ఇంద్రవెల్లికి చెందిన షేకు బాయి, ఉట్నూర్‌కు చెందిన సభా సమ్రీన్‌ల బిడ్డలు ఆసుపత్రి నిర్లక్ష్యానికి బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎంజీఎంలో దయనీయ పరిస్థితులు
ఉత్తర తెలంగాణకు పెద్దదిక్కుగా ఉన్న వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో శిథిలావస్థకు చేరిన పైకప్పులు కూలిపోవడం, వార్డుల్లో ఎలుకలు, వీధి జంతువులు సంచరిస్తూ రోగులపై దాడులకు పాల్పడటం దారుణమని పేర్కొన్నారు. పడకలు, వైద్య సిబ్బంది కొరతతో రోగులకు కనీస గౌరవం లేకుండా నేలపైనే పడుకోబెట్టి చికిత్స అందిస్తున్నారని కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆర్టికల్ 21 ఉల్లంఘనే:న్యాయవాది వినోద్ హిందూస్తాని. ప్రాణాలను కాపాడాల్సిన ఆసుపత్రులే మృత్యుకుహరాలుగా మారడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 జీవించే హక్కు ఉల్లంఘన, నేరపూరిత నిర్లక్ష్యం కిందకే వస్తుందని న్యాయవాది స్పష్టం చేశారు. భద్రతా ఆడిట్ నిర్వహించాలి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో తక్షణమే స్వత త్ర భద్రతా ఆడిట్ నిర్వహించాలని, అగ్నిమాపక పరికరాలను ఆధునికీకరించాలని పిటిషనర్ కోరారు. ఆసుపత్రుల్లో పారిశుద్ధ్యం, మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు ఖాళీగా ఉన్న వైద్యులు, నర్సింగ్ సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనలో బిడ్డలను కోల్పోయిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున తగిన ఆర్థిక పరిహారం చెల్లించేలా ఆదేశించాలని కోరారు.ఈ అంశాలను తీవ్రంగా పరిగణించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ.. బాధితులకు న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్‌కు స్పష్టం చేసింది. తీసుకున్న చర్యలకు సంబంధించిన పూర్తి నివేదికను ఆంగ్లంలో అనువదించి, నాలుగు వారాల్లోగా 'హెచ్‌ఆర్‌సీనెట్' పోర్టల్ ద్వారా సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

