ఆన్‌లైన్ మండల స్థాయి క్విజ్ పోటీల్లో తెలంగాణ ఆదర్శ పాఠశాల విద్యార్థుల ప్రతిభ
టేక్మాల్ : మండలంలోని కేజీబీవీ పాఠశాలలో నిర్వహించిన ఆన్‌లైన్ మండల స్థాయి క్విజ్ పోటీల్లో తెలంగాణ ఆదర్శ పాఠశాలకు చెందిన విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. 8వ తరగతికి చెందిన అమ్రిన్ మొదటి బహుమతి సాధించగా, 10వ తరగతికి చెందిన ఐషా ఫాతిమా కూడా మొదటి బహుమతిని కైవసం చేసుకుంది. ఈ పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి సుజాత జిల్లా పరిషత్ హెచ్ఎం రాజేంద్రప్రసాద్ కేజీబీవీ ఎస్ఓ పాల్గొన్నారు ఈ విషయాన్ని పాఠశాల క్విజ్ మాస్టర్ నర్సింలు తెలిపారు. విజయం సాధించిన విద్యార్థులు తదుపరి జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు సాధించిన విజయంపై పాఠశాల ప్రిన్సిపాల్ సుంకరి సాయిలు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులను అభినందిస్తూ, జిల్లా స్థాయి పోటీల్లో కూడా ప్రతిభ కనబరిచి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


