*పేద ప్రజలకు అండగా సీఎం సహాయ నిధి – సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన డీసీసీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్
*ప్రతి పేద కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది – డా. నరేష్ జాదవ్
ఆదిలాబాద్ బ్యూరో : ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని శాంతాపూర్, కోలారి గ్రామాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ గారు లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా శాంతాపూర్ గ్రామానికి చెందిన లగాడే ఈశ్వర్ కు రూ.60,000/- విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. అలాగే కోలారి గ్రామానికి చెందిన ముండే నందకిషోర్ కు రూ.60,000/- విలువైన చెక్కులను అందించారు.
*ఈ సందర్భంగా డా. నరేష్ జాదవ్ మాట్లాడుతూ.
పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తూ, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు.
ఇందిరమ్మ కుటుంబ భీమా పథకం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహ వినియోగానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం పంపిణీ, రైతులకు రైతు భరోసా, అర్హులైన వారికి ఆసరా పింఛన్లు వంటి ప్రజోపయోగ కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని వివరించారు.
ప్రజల ఆరోగ్యం, సంక్షేమం, అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరంతరం కృషి చేస్తారని *డా. నరేష్ జాదవ్ తెలిపారు.
ప్రజల కష్టాల్లో తోడుగా ఉంటూ, ప్రతి కుటుంబానికి అండగా నిలవడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.
ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు గుడిహత్నూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తొడసం దౌలత్ రావు, శాంతాపూర్ సర్పంచ్ సబ్లే పత్తు సింగ్, ఉప సర్పంచ్ కరాడ్ రవి,మండల ఉపధ్యక్షులు మొయితే మారుతీ, దుబ్బాక నరేష్, సూర్యగూడ సర్పంచ్ రహీం, ఉమ్రి సర్పంచ్ భరత్, మండల మైనార్టీ అధ్యక్షులు సమీర్ ఖాన్, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ నాగ్ నాథ్ అప్ప, కోలారి మాజీ సర్పంచ్ బాలాజీ పటేల్*,ఆడే జైపాల్, బోరిగాం మాజీ ఎంపీటీసీ ప్రవీణ్ రెడ్డి,బ్రహ్మానంద్, కాగ్నే రామ్ కిషన్, శ్యామ్, యోగి, మరియు మండల పిఎసి మెంబర్స్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


