ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు దాతల చేయూత
ఉచితంగా దుస్తుల పంపిణీ
మేడిపల్లి/భీమారం, ( జగిత్యాల) : రాజలింగంపేట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు చదువుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డుకాకూడదనే ఉద్దేశంతో పలువురు దాతలు తమ ఉదారతను చాటుకుంటూ ముందుకొచ్చి విద్యార్థులకు ఉచితంగా దుస్తులను (యూనిఫామ్స్) పంపిణీ చేయడం జరిగింది. అనంతరం వీరిని పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దాతలు గూగులవత్ మధు, ఎగుర్ల కుమార్, జాడ నగేష్, చిట్యాల సురేష్, కుంభం అంజయ్యలతో పాటు గ్రామ సర్పంచ్ గాజోజి చారి, ఉప సర్పంచ్ నేరెళ్ళ సంజన రాజేందర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం శ్రీనివాస్, డి శ్రీధర్, ఉపాధ్యాయులు పి రాజేంద్రప్రసాద్, సంగీత తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


